క్రైసిస్ మేనేజ్ మెంట్ తోనే కాంగ్రెస్ భవితవ్యం
రాహుల్ ను మోడీ నాయకుడిగా చేస్తున్నారా ?
దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ప్రజలు అక్షరాస్యత, అవగాహన కలిగి ఉండాలి. అదే సమయంలో ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన న్యాయవ్యవస్థ, పత్రికా వ్యవస్థ స్వతంత్ర్యంగా పనిచేయాలి. అలాగే స్వతంత్ర్య వ్యవస్థలైన ఎన్నికల కమిషన్, కాగ్,ఈడీ, సీబీ ఐ వంటివి ప్రలోభాలకు లొంగకుండా తమ పని చేసుకుపోవాలి. అయితే మన రాజకీయ నాయకులు వాటిని స్వతంత్ర్య సంస్థలుగా కాకుండా, జేబు సంస్థలుగా చేసుకోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయి.
ఇప్పటివరకు పాలించిన పార్టీ లేదా ఏ పార్టీ ప్రభుత్వం అయినా స్వతంత్ర సంస్థలకు స్వతంత్రం లేకుండా చేయడంలో సక్సెస్ సాధించాయి. అందుకే కాంగ్రెస్ పాలనలో అయినా,బీజేపీ పాలన అయినా వ్యక్తులు మారుతున్నారుగాని వ్యవస్థలో పునరుజ్జీవనం లేకుండా చేస్తున్నారు.
నాలుగేళ్ల క్రింతటి రాహుల్ కేసుపై ఉన్నట్టుండి శుక్రవారం సూరత్ కోర్టు తీర్పు వెలువరించింది. కారణం ఏమై ఉంటుందో అందరికీ తెలిసిందే. సాక్షాత్తూ ప్రధాని (రాజీవ్ గాంధీ) హత్య క్రిమినల్ కేసే పదేళ్ల పైగా నడిచిన దేశం ఇది. గుజరాత్ అల్లర్లు, బాబ్రీమసీదు కేసులు కూడా దశాబ్దాల తరబడి కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయి. అయితే బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఆ కేసులన్నింటికీ మోక్షం వచ్చి నాయకులందరూ క్లీన్ చిట్ తో బయటకు వచ్చారనుకొండి. ప్రస్తుత సమస్య కోర్టు తీర్పులు కాదు కాని, వాటి స్వతంత్రతపైనే సామాన్యుడి ఆవేదన.
సూరత్ కోర్టు రాహుల్ గాంధీ కర్ణాటకలో మోడీ ఇంటిపేరుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రేండేళ్ల జైలు, రూ.15,000 అపరాధరుసం చెల్లించాలని తీర్పును వెలువరిస్తూ, పైకోర్టులో అప్పీలు చేసకోవడానికి నెల రోజుల సమయం ఇచ్చింది. అయినప్పటీకీ లోక్ సభ స్పీకర్ రాహుల్ కు సమయం ఇవ్వకుండా తన విజ్నతతో పార్లమెంటు నుంచి ఎక్స్ పెల్ చేశారు.
ఇంత త్వరత్వర నిర్ణయాలు తీసుకుంటానికి కారణం ఏమిటంటే ఆదాని రగడ. హిండెన్ బర్గ్ నివేదిక వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ దాని అధినాయకుడు పార్లమెంటులో మోడీ – ఆదాని ప్రెండ్షిప్ పై చేసిన విమర్శలు అధికార పార్టీని ఇరుకున పెట్టాయి. దేశంలో ప్రజాస్వామ్యం కృశించి పోతుందని, మిగతా వ్యవస్థలను స్వతంత్రంగా పనిచేయనివ్వడం లేదని ఆయన తీవ్రంగా విరుచుకుపడినప్పటి నుంచి రాహుల్ గాంధీకి పార్లమెంట్ లో ప్రసంగించడానికి మైక్ ఇవ్వడం లేదు. అంతేకాని నాకు, ఆదానికి సంబంధం లేదు. తను వాణిజ్యవేత్త, నేను రాజకీయ నాయకుడిని అని ప్రధాని మోడీ చెప్పలేకపోతున్నారు.
చట్టసభల నుంచి సభ్యత్వం కోల్పోయే చట్టాలు
చట్టంలోని సెక్షన్ 8 (1) ప్రకారం, రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం, లంచం తీసుకోవడం, ఎన్నికలను ప్రభావితం చేయడం లాంటి కేసుల్లో శిక్ష పడితే చట్టసభ సభ్యత్వం కోల్పేయే అవకాశం ఉంటుంది.
మరోవైపు ఆహార పదార్థాలను అక్రమంగా నిల్వచేయడం లేదా కల్తీ చేయడం లాంటి కేసులో శిక్ష పడినా లేదా వరకట్న నిషేధ చట్టం కింద ఆరు నెలలు శిక్ష పడినా సభ్యత్వం కోల్పోవచ్చు.
చట్టంలోని సెక్షన్ 8 (3) ప్రకారం, ఏదైనా కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడినా సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఈ కేసులో అంతిమ నిర్ణయం స్పీకర్‌దే.
అంటే ఒకవేళ హైకోర్టు రాహుల్ గాంధీ శిక్షను రెండేళ్ల కంటే తక్కువకు తగ్గిస్తే, ప్రస్తుత సీటును ఆయన కాపాడుకోవచ్చు. అంతేకాదు, భవిష్యత్ ఎన్నికలకు అనర్హుడు కాకుండా అడ్డుకోవచ్చు.
రాహుల్ గాంధీలో నాయకత్వ లక్షణాలు
వాస్తవానికి రాహుల్ గాంధీలో నాయకత్వ లక్షణాలు గాని,నానమ్మఇందిరాగాంధీలా ప్రత్యర్తులను పరుగులెత్తించే వాగ్బాణాలు కాని తండ్రి రాజీవ్ గాంధీలా రాజకీయాలు చేయడం, కలుపుకుపోవడాలు ఆయనకు లేవు. అయితే మోడీ ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే అవన్నీ నేర్చుకుంటున్నారు. అధికార పార్టీ ఇరుకున పెట్టి, తొక్కివేయాలని చేసే ప్రతిపనిలో అతను రాటు దేలతాడు. ఇది చరిత్ర చెప్పిన నిజం ..ప్రపంచంలో ఏ నాయకుడూ పుట్టుకతో నాయకత్వంతో పుట్టలేదు. పరిస్థితుల ప్రభావం అలా చేస్తాయి. అంతే..
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసినప్పటి నుంచి ప్రజలు ఆయనలో పూర్తి స్థాయిలో కాకున్నా ఒకమోస్తరు నాయకుడిని చూస్తున్నారు. అది అధికార పక్షానికి మింగుడు పడటం లేదు. అందుకే ఈ రచ్చ.
స్పీకర్ నిర్ణయాన్ని రాహుల్ సవాల్ చేయొచ్చా?
తన సభ్యత్వాన్ని రద్దుచేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకోవచ్చు.
‘‘అప్పీలు చేసుకునే హక్కు రాహుల్ గాంధీకి ఉంది. ఎవరివైనా హక్కుల ఉల్లంఘన జరిగితే, రాజ్యాంగ ప్రకారం, రాజ్యంగ కోర్టులు (హైకోర్టు లేదా సుప్రీం కోర్టు)లను వారు ఆశ్రయించొచ్చు. ఆర్టికల్ 226 కింద ఆయన హైకోర్టుకు వెళ్లొచ్చు. లేదా ఆర్టికల్ 32 కింద నేరుగా సుప్రీం కోర్టుకు వెళ్లొచ్చు
హైకోర్టు నుంచి ఉపశమనం వస్తే, ఏం జరుగుతుంది?
మొదట సూరత్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది.
అక్కడ ఈ కేసు నుంచి విముక్తి లభించినా లేదా శిక్షను తగ్గించినా నేరుగా ఆయన పార్లమెంటు సభ్యత్వ పునరుద్ధరణ జరగదు. దీని కోసం మళ్లీ ఆయన హైకోర్టు లేదా సుప్రీం కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది.
ఈ కేసులో తన ఆదేశాలను స్పీకర్ సమీక్షించుకోవడానికి వీలుపడదు. హైకోర్టు లేదా సుప్రీం కోర్టు నిర్ణయం కోసం ఆయన ఎదురుచూడాల్సి ఉంటుంది.
అయితే ఈ విపత్కర పరిస్థితిని రాహుల్ ఎలా డీల్ చేస్తాడన్నదానిపైనే కాంగ్రెస్ భవితవ్యం ఉంటుంది.
ఇక తీర్పు విశయానికి వస్తే, సూరత్ తీర్పును హైకోర్టు లేదా సుప్రీంకోర్టు కొట్టివేస్తే, ప్రభుత్వం దాన్ని కూడా రాజకీయం చేస్తుంది. ఎలాగంటే ప్రజల మద్దతుతో గెలిచిన పార్లమెంటే అత్యున్నతం అంటుంది. ఇప్పటికే కొలీజియంతో న్యాయమూర్తులను నియమించడం బీజేపీకి సుతారమూ ఇష్టం లేదు. జడ్జీల నియామకం పై నేషనల్ జ్యుడీషియల్ కమిషన్ ను నియమించినా సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. దీంతో పార్లమెంటు తన విచక్షణ పరిధిలోకి న్యాయవ్యవస్థను చొరబడనీయదు. ఇప్పటికే ఎన్నికల వ్యవస్థలో ఎక్కువగా జోక్యం చేసుకుందని సుప్రీంకోర్టుపై కేంద్రం ఆగ్రహంగా ఉంది.
శశిధరూర్ కామెంట్లు
రాహుల్ గాంధీ గళం వినిపించకూడదని, బీజేపీ ఆయనపై అనర్హత వేటు వేసినప్పటికీ ప్రపంచంలో అన్ని మూలలా ఆయన గొంతే వినిపిస్తుందని, పార్లమెంటు నుంచి విదేశీ మీడియా ఈ ఫుటేజ్ ను అన్నిచోట్లకు పంపిందని శశిధరూర్ తెలిపారు. ఆస్ట్రేలియ నుంచి గార్డియన్, స్పానిష్ నుంచి టెలిముండో, జర్మనీ నుంచి ఫ్రాంక్ ఫర్ట్ అల్జిమీని, సౌదీ నుంచి అశ్రక్ న్యూస్, ఫ్రాన్స్ నుంచి ఆర్ ఎఫ్ ఐ, సీఎన్ ఎన్, బ్రసిల్ దీనిపై ప్రసారాలు చేశాయని ఆయన ట్వీట్ చేస్తూ, భారత్ గళాన్ని ప్రపంచం మొత్తం వింటుందన్నారు.
సుప్రీం వర్సెస్ కేంద్రం లేదా సుప్రీం ప్లస్ ప్రతిపక్షం వర్సెస్ కేంద్రం అనేది త్వరలో తేలుతుంది. ఏది ఏమైనా బీజేపీ మరొక సారి కాంగ్రెస్ ను మట్టికరిపిస్తుందా ? లేదా కాంగ్రెస్ మళ్లీ తన వైభవాన్ని చాటుకుంటుందా అనేది కాలం చెప్పాల్సిందే.
The future of Congress depends on crisis management
Is Rahul being made as Modi’s leader?
For democracy to flourish in the country, people must have literacy and understanding. At the same time, the judiciary and the press, which are the pillars of democracy, should function independently. Also independent systems like Election Commission, CAG, ED, CBI should do their work without succumbing to temptation. But the problems arise when our politicians make them into pocket organizations instead of independent ones.
So far the ruling party or any party government has succeeded in depriving independent institutions of independence. That’s why people are changing even under Congress rule or BJP rule and they are not revitalizing the system.
The Surat court on Friday gave its verdict on Rahul’s case four years ago. Everyone knows the reason. This is a country where the criminal case for the assassination of Prime Minister (Rajiv Gandhi) has been going on for more than ten years. Gujarat riots and Babri Masjid cases are also pending in courts for decades. But when the BJP government came, all those cases got salvation and all the leaders came out with a clean chit. The current problem is not the court judgments but the common man’s concern over their independence.
A Surat court sentenced Rahul Gandhi to two years in jail and a fine of Rs 15,000 for his controversial remarks on Modi’s surname in Karnataka and gave him a month to file an appeal in the higher court. However, without giving time to Lok Sabha Speaker Rahul, he expelled him from the Parliament.
Adani Ragada is the reason for taking such hasty decisions. Ever since the Hindenburg report came out, the criticism of the opposition, especially the Congress, on the Modi-Adani friendship in Parliament, has put the ruling party in a bind. Rahul Gandhi has not been given the mic to address the Parliament since he lashed out that the democracy in the country is going down and other systems are not being allowed to function independently. Moreover, I have nothing to do with it. Prime Minister Modi cannot say that he is a businessman and I am a politician.
Acts of Deprivation of Membership from Legislatures
According to Section 8 (1) of the Act, if convicted in cases like inciting enmity between two communities, accepting bribes and influencing elections, the membership of the legislature is liable to be revoked.
On the other hand, if you are convicted of illegal storage or adulteration of food items, or if you are sentenced to six months under the Dowry Prohibition Act, you may lose your membership.
According to Section 8 (3) of the Act, any offense punishable with imprisonment of two years shall be liable to cancellation of membership. The final decision in this case rests with the speaker.
That means if the High Court reduces Rahul Gandhi’s sentence to less than two years, he can retain his current seat. Moreover, it can prevent him from being disqualified for future elections.
Leadership qualities in Rahul Gandhi
In fact, Rahul Gandhi does not have the leadership qualities, nor does his grandmother Indira Gandhi have the eloquence to make opponents run away, but he does not have the politicking and integration like his father Rajiv Gandhi. But they are learning all that now in Modi government. He is adamant in everything that the ruling party tries to do. This is the truth told by history..No leader in the world was born with leadership. Circumstances make it so. That’s it..
Ever since Rahul Gandhi’s Bharat Jodo Yatra, people have seen him as a moderate leader, if not a full-fledged one. It is not acceptable to the ruling party. Hence the fuss.
Can Rahul challenge the Speaker’s decision?
Rahul Gandhi can appeal against the Speaker’s decision to cancel his membership in the High Court or the Supreme Court.
Rahul Gandhi has the right to appeal. In case of violation of any person’s rights, as per the Constitution, they can approach the Constitutional Courts (High Court or Supreme Court). He can go to the High Court under Article 226. Or you can go directly to the Supreme Court under Article 32
If relief comes from the High Court, what will happen?
First, Rahul Gandhi will have to go to the High Court against the Surat court verdict.
There, if he is acquitted from this case or his sentence is reduced, he will not be directly reinstated as a member of Parliament. For this again he will have to go to the High Court or the Supreme Court.
The Speaker cannot review his orders in this case. He will have to wait for the decision of the High Court or the Supreme Court.
But the fate of Congress depends on how Rahul deals with this dire situation.
And when it comes to the verdict, if the Surat verdict is struck down by the High Court or the Supreme Court, the government will politicize it too. After all, the parliament won with the support of the people is said to be supreme. BJP does not want to appoint judges with collegium already. The Supreme Court set aside the National Judicial Commission on the appointment of judges. Thus Parliament cannot encroach upon the Judiciary within its scope of discretion. The Center is angry with the Supreme Court for already interfering too much in the election system.
Shasidharur comments
Shasidharur said that Rahul Gandhi should not be heard, even though BJP has disqualified him, his voice will be heard in every corner of the world, and the foreign media has sent this footage from the Parliament to all places. Guardian from Australia, Telemundo from Spain, Frank Furt Algemini from Germany, Ashrak News from Saudi, RFI, CNN and Brazil from France have broadcasted on this, he tweeted and said that the whole world is listening to India’s voice.
Supreme vs Center or Supreme plus Opposition vs Center will be decided soon. Anyway, will BJP defeat Congress again? Or whether the Congress will show its glory again, only time will tell.