94,689 మంది విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాల పంపిణీ
-ఫిబ్రవరి 3న తెనాలిలో మంత్రులు శ్రీ సత్యకుమార్, నాదెండ్ల మనోహర్ చే ప్రారంభం
జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 94,689 మంది విద్యార్థులకు ఉచిత కంటి అద్దాల పంపిణీ ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం కానుంది. గుంటూరు జిల్లా తెనాలిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతులమీదగా రాష్ట్ర వ్యాప్త ప్రారంభ కార్యక్రమం లాంఛనంగా జరగబోతుంది. దీనికి అనుగుణంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో సదరు ప్రాంతాల విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ జరగనుంది. ఎంపికచేసిన ప్రభుత్వ పాఠశాలల్లో ఆరేళ్ల నుంచి 18 ఏళ్లలోపు చదివే విద్యార్థులకు కిందటేడాది జులై నుంచి నవంబరు వరకు పారా మెడికల్ opthalimic అసిస్టెంట్సు ద్వారా కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు చేయించుకున్న వారిలో 94,689 మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించారు. ఇందుకు అనుగుణంగా కంటి అద్దాలు సిద్ధమయ్యాయి. ఇందుకు సుమారు రూ. 2.52 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేస్తోంది.














































