ఘనంగా వైయస్ఆర్ రైతు దినోత్సవం
కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని కర్నూలు నగరంలో వైయస్ఆర్ రైతు దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కర్నూలు ఎస్వీ కాంప్లెక్స్ ఎదురుగా ఏర్పాటైన దివంగత మహానేత డా. వైయస్ రాజ శేఖర్ రెడ్డి 74 వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే హాఫీజ్‌ఖాన్, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్ వి మోహన్ రెడ్డి , మురళీకృష్ణ, మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఎస్ వి విజయ మనోహరి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీతో ఎందరో పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన ఆరోగ్య ప్రదాత,పీజు రియంబర్స్ మెంట్ ద్వారా ఎందరోబడుగు బలహీన వర్గాల పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించిన విద్యా ప్రదాత, సొంత ఇల్లు లేక కటిక పేదరికంలో మగ్గుతున్న ఎందరో పేద ప్రజల కు సొంత ఇల్లు కట్టించిన మహానుభావుడు,రైతులకు ఉచ్చిత కరెంట్టు ఇచ్చారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మహత్తరమైన కార్యాలు చేసి ప్రజల గుండెల్లో నేటికీ కొలువై ఉన్న మహానుభావుడు మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మాజీ డైరెక్టర్లు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు,లాయర్లు , పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.