Amaravati: Hon’ble Chief Minister of Andhra Pradesh Sri Y.S Jagan Mohan Reddy Distributed Financial Assistance to Eligible Junior Advocates under “YSR Law Nestham”, Virtually from Camp Office, Tadepalli on 22-02-2023 Wednesday at 11:00 AM
YSR Law Nestham – Fourth consecutive year
In the accounts of 2,011 eligible junior lawyers across the state, Rs. 1,00,55,000 was released by CM Shri YS Jagan by pressing a button in the CM camp office.
What the junior lawyers who spoke virtually on this occasion said…in their own words
Amulya, Beneficiary of Law Nestham, Junior Advocate, NTR Distt
Hello sir, I am practicing as a junior lawyer in Bejawada bar association since one year, my goal is to become a good criminal lawyer, we are a middle class family, my parents, everyone around me says that I can go around the courts without doing a good job, I can get a good salary job, but my goal is to reach. I am moving ahead with ambition, there are many times when I feel sad that after graduation I have to help my parents and earn for my expenses. At such a time, the La Nestham scheme was very helpful for me, it increased my confidence. This stipend is very useful for me, I was able to stand on my feet without depending on my parents, that is because of this scheme, when we told you about our problems during the padayatra, you told us about the scheme, and then we are very happy that you implemented it when you came to government, thank you sir.
CH. Vennela, Junior Advocate, Guntur
Sir, I am a junior advocate, my mother is tailoring, my father is a private employee, I am taking law degree from 2021, this money is used to cover the fees of judicial exams and buy material. Your support for higher studies is very useful. Thank you from all of us. Our family gets a lot of financial help, many people in the state are benefited by the schemes you have introduced, my mother has got a house degree, you give a lot of priority to education, you have introduced good schemes for students, you are also helping to study abroad, you are giving pension, ration close to home, you are moving forward with high ideas. I want to help poor students free of charge by taking you as an example. I am very happy, thank you sir.
22.02.2023
అమరావతి:
వైఎస్సార్ లా నేస్తం – వరుసగా నాలుగో ఏడాది
రాష్ట్రవ్యాప్తంగా 2,011 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో రూ. 1,00,55,000 సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి విడుదల చేసిన సీఎం శ్రీ వైఎస్ జగన్
ఈ సందర్భంగా వర్చువల్‌గా మాట్లాడిన జూనియర్ న్యాయవాదులు ఏమన్నారంటే…వారి మాటల్లోనే
అమూల్య, లా నేస్తం లబ్ధిదారు, జూనియర్ న్యాయవాది, ఎన్‌టీఆర్ జిల్లా
నమస్కారం సార్, నేను బెజవాడ బార్ అసోసియేషన్‌లో ఏడాది నుంచి జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను మంచి క్రిమినల్ లాయర్ అవ్వాలన్నది లక్ష్యం, మాది మధ్యతరగతి కుటుంబం, మా తల్లిదండ్రులు, చుట్టూ ఉన్నవారంతా మంచి ఉద్యోగం చేసుకోక కోర్టుల చుట్టూ తిరుగుతావు ఎందుకని, మంచి శాలరీ వచ్చే ఉద్యోగం చేసుకోవచ్చు కదా అంటుంటారు, కానీ నా లక్ష్యం చేరుకోవాలనే ఆశయంతో నేను ముందుకెళుతున్నాను, గ్రాడ్యుయేషన్ పూర్తవగానే నా పేరెంట్స్‌కు సాయం చేయాలని, నా ఖర్చులకు నేను సంపాదించాలని బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి సమయంలో లా నేస్తం పథకం నాకు చాలా ఉపయోగపడింది, దీంతో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ స్టైఫండ్ ద్వారా నాకు చాలా ఉపయోగపడుతుంది, నా పేరెంట్స్ మీద డిపెండ్ అవకుండా నా కాళ్ళ మీద నేను నిలబడిగలిగాను అంటే ఈ స్కీమ్ కారణం, పాదయాత్రలో మీకు మా సమస్యలు చెప్పగానే మీరు స్కీమ్ గురించి చెప్పడం, ఆ తర్వాత ప్రభుత్వంలోకి రాగానే అమలుచేయడంతో మేం చాలా సంతోషంగా ఉన్నాం, ధ్యాంక్యూ సార్.
సీహెచ్. వెన్నెల, జూనియర్ న్యాయవాది, గుంటూరు
సార్, నేను జూనియర్ అడ్వకేట్‌ను, మా తల్లి టైలరింగ్ చేస్తుంది, మా తండ్రి ప్రేవేట్ ఉద్యోగి, నేను 2021 నుంచి లా నేస్తం తీసుకుంటున్నాను, ఈ డబ్బు జ్యూడిషియల్ ఎగ్జామ్స్ ఫీజు కట్టుకోవడానికి, మెటీరియల్ తీసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఉన్నత చదువుల కోసం మీరు ఇస్తున్న సపోర్ట్ చాలా ఉపయోగంగా ఉంది. మా అందరి తరపునా మీకు ధన్యవాదాలు. మా కుటుంబానికి చాలా ఆర్ధిక సాయం అందుతుంది, మీరు ప్రవేశపెట్టిన పథకాల ద్వారా రాష్ట్రంలో అనేకమంది లబ్ధిపొందుతున్నారు, మా అమ్మకు ఇంటి పట్టా వచ్చింది, మీరు చదువుకు చాలా ప్రాధాన్యతనిస్తున్నారు, విద్యార్ధులకు మంచి పథకాలు ప్రవేశపెట్టారు, విదేశాల్లో చదువుకోవడానికి కూడా మీరు సాయం చేస్తున్నారు, పెన్షన్, రేషన్ ఇంటి దగ్గరే ఇస్తున్నారు, ఉన్నత ఆలోచనలతో మీరు ముందుకెళుతున్నారు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని పేద విద్యార్ధులకు ఉచితంగా సాయం చేయాలనుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది, ధ్యాంక్యూ సార్.