* అమరావతి
* – పూర్వోదయ పథకంలో రాయలసీమ అభివృద్ధికి రాష్ట్ర ప్రణాళికలపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసలు
* పూర్వోదయ పథకం కింద 9 జిల్లాల అభివృద్ధికి సహకరిస్తామని తెలిపిన కేంద్ర ఆర్ధిక మంత్రి
* రాయలసీమ జిల్లాలు, ప్రకాశం జిల్లాల్లో ఉద్యాన పంటల అభివృద్ధికి, రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల కోసం ఏపీ ప్రణాళికలు
* పూర్వోదయ పథకం కింద ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులకు రూ.39 వేల కోట్ల మేర ప్రణాళికలు రూపోందించిన ఏపీ ప్రభుత్వం
* 9 జిల్లాల్లోని ఉద్యాన ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల మార్కెట్ లకు తరలించేందుకు వీలుగా బ్యాంకులు సహకరించాలని సూచించిన కేంద్ర ఆర్ధిక మంత్రి
* కేవలం కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలకే పరిమితం కావొద్దని జాతీయ బ్యాంకులకు సూచించిన నిర్మలా సీతారామన్
* ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకింగ్, కోల్డ్ చెయిన్ లాంటి పరిశ్రమలకూ ఊతం ఇవ్వటం ద్వారా రైతులకు సహకరించాలని స్పష్టం
* మహారాష్ట్ర నుంచి అరటి, తమిళనాడు నుంచి కొబ్బరి ముంబై, ఢిల్లీ లాంటి ప్రాంతాలకు రైళ్లలో తరలుతున్నాయని వెల్లడి
* అదే తరహాలో 9 జిల్లాల్లోని ఉద్యాన రైతుల పండించిన ఉత్పత్తులు ఇతర మార్కెట్లకు తరలించేందుకు అన్ని విధాలా సహకరించాలని స్పష్టం
* దేశానికి పౌష్టికాహారం అందించే రైతులకు దానికి మించి ఆర్ధిక ప్రయోజనాలు కల్పించాలని బ్యాంకులకు సూచించిన కేంద్ర మంత్రి
రాజధాని నిర్మాణానికి భూములు త్యాగం చేసిన రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవడం బ్యాంకుల బాధ్యత అని పేర్కొన్న మంత్రి

















































