మన వార్తలెందుకు వంకర పోయాయి ?
ఈ హీరో కొడుకును చూడండి ఆచొక్కా ఖరీదెంతో తెలుసా? తెలిస్తే షాక్ ! ఈ హీరో బూటు ఖరీదెంతో తెలుసా ? తెలిస్తే గూండాగిపోతుంది. ఆ హీరో కూతురు చూడండి , ఆమెకు ఇది ఎన్నో పెళ్ళో తెలుసా? మొదటి మొగుడు ఏంచేస్తున్నాడో తెలుసా? రెండోమొగుడు ఎందుకొదిలేశాడో తెలుసా ? ఇవి మన వార్తల టైటిల్స్. వార్తలన్నీ సెన్సేషనే టైటిల్స్ అన్నీ అతిశయోక్తులే. ఒక నటి లేదా నటుడి కూతురు కొత్త చెడ్డి కొనుక్కున్న, చిరిగిపోయిన, చెడ్డి జారిపోయిన లేచిపోయి పారిపోయినా, పెళ్లి చేసుకున్నా , విడాకులు తీసుకున్నా అంతా సెన్సేషన్.
ఒకప్పుడు వార్తలు హుందాగా ఉండేవి. ఖచ్చితంగా ఉండేవి. అందుకే వార్తలు అంటే ఒక గౌరవం ఒక నమ్మకం ఉండేవి. సరైన విషయం ఉంటేనే వార్త , సరైన టైటిల్ పెట్టేవారు. అలాగే మరి ఈరోజు ప్రతి పనికిమాలిన విషయం వార్తే. పూర్తి వ్యక్తిగత విషయాలు , చీకటి వ్యవ్యహారాలు ఊహాగానాలు, సెటైర్లు పైగా వంకర టైటిల్స్ తో వస్తున్నాయి వార్తలు. హెడింగ్ కి వార్తకి సంబంధం ఉండటం లేదు. వీడియోలు వచ్చిన తరువాత వేళాకోళం పెరిగిపోయింది. మన వార్తలు పూర్తిగా మారిపోయాయి.
దీనికి కారణం జర్నలిజం లో విలువలు పడిపోడమే అంటారు. కానీ ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. కుర్రాడిలో విషయంలేదు ఐనా ఐ ఐ టీ లో సీటు కావాలి. అమ్మాయి కి అర్హత లేదు ఐనా ఎం బి బి ఎస్ లో సీటు కావాలి. కోచింగ్ సెంటర్లలో కూచోబెట్టి వాళ్ళని రుద్దుతూ ఉంటారు. ఏమీ లేనోడు సెలిబ్రిటీ అయిపోవాలి. ఇక్కడా అంతే రుద్ధుడే. అయితే కోచింగ్ సెంటర్లలో కోచింగ్ కివచ్చిన వాళ్లనే అంటే ప్రతిభ లేనివాళ్లనే రుద్దుతారు. అది తప్పులేదు. మీడియా కంపెనీలలో ప్రతిభాలేనివాడిని కూర్చోబెట్టి ప్రజలమీద రుద్దుతారు. అర్హత లేనివాళ్లు మీడియా కంపెనీ ల్లో కూర్చుంటే వాళ్ళను ప్రజలపై రుద్ది రుద్ది సెలిబ్రిటీస్ చేసేస్తున్నారు ఈ క్రమంలో వార్తలు వంకర పోతున్నాయి
ఇప్పుడు న్యూస్ అంటూ ఏం ఉండదు.
డబ్బు చేసుకున్న ఒక నటుడి కి అతడి వారసులకు, జబ్బబు చేసిన మీడియా చేసే నిత్య పూజలే మనకి న్యూస్. వాళ్లు వాళ్ళ కుటుంబం అంతా హీరోలే వయసుమళ్లినా యువకులే ఎక్కడికెళ్లినా ఏం తిన్నా ఏం , కొన్నా అంతా సెన్సేషన్. అంతా మనం తెలుసుకుతీరాల్సిందే, గుర్తుంచుకు తీరాల్సిందే న్యూస్ పేరుచెప్పి ప్రతీ చెత్తా మన బ్రెయిన్స్లో కూరేస్తారు. ఇప్పుడు ఈ చెత్త న్యూస్ పుణ్యమా అని బుర్రలు చెత్తకుప్పలు అవుతున్నాయి
మన పిల్లలకి చదువు ఏం ఎక్కడం లేదు. పదేళ్లు చదువుకున్నా ఇంగ్లీషులో ఒక్క వాక్యం తిన్నగా రాయలేరు. వీడియోలు చూడ్డమే తప్ప కాయితం చదవలేరు. చదివి చరిత్ర తెలుసుకోలేరు ఒకప్పుడు చరిత్ర పుస్తకాల్లో చదివి తెలుసుకునేవారు ఇప్పుడు సినిమాలు చూసి తెలుసు కుంటున్నారు. మీడియా కంపెనీల పుణ్యామా అని ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు పండితులు అందరూ పక్కకి పోయి ఈ రుద్దుడు బాబులు (సెలబ్రిటీస్) రాజ్యమేలుతున్నారు. విద్య నాణ్యత విద్యాసంస్థల మీద సమాజం నాణ్యత మీడియాకంపెనీలమీద ఆధారపడి ఉంటుంది.