విశ్వకవి ఠాగూర్ పద్యాలకు అద్భుత పేరడీ
ఆయన లాగే 200 ఇంగ్లిష్ పద్యాలు వ్రాసిన కవి
ఆంగ్ల సాహిత్య చరిత్రలో కీర్తికెక్కిన షేక్స్ పియర్ కంటే ఎక్కువ సోనెట్లు రచించి ప్రపంచ రికార్డ్ సొంతం చేసుకున్న పూలబాల విశ్వకవి రవీద్రనాథ బాటలోనే నడిచారు . “ఇండియన్ సోనెటీర్” అనే రెండువందల కఠినమైన ప్రాసనియమాలు కలిగిన ఇంగ్లిష్ పద్యాలు వ్రాసారు. ఇండియన్ సోనెటీర్” అంటే భారతీయ పద్యకారుడు అని అర్థం. ఇందులో అడుగడుగునా భారతీయ చరిత్ర , యుద్దాలు , సంస్కృతి జీవన విధానాలను , ఆలోచనలను హృద్యంగా గుర్తుండిపోయే పద్యాలు గా మలిచారు.
ఠాగూర్ ఒక ఉన్న త మైన సమాజాన్ని , కోరుకుని ఈ పద్యం వ్రాసారు కానీ
Where the mind is without fear – -Rabindranath Tagore
Where the mind is without fear and
the head is held high
where the world has not been broken up
into fragments by narrow domestic walls
where words come out from the depth of truth
where tireless striving stretches its arms
towards perfection
where the clear stream of reason
has not lost its way
Into the dreary desert sand of dead habit
where the mind is led forward by thee
Into ever-widening thought and action
Into that heaven of freedom,
my father let my country awake.
ఆయన కలలు కల్లలు గా మారాయి నేటి సమాజం అందుకు బిన్నంగా ఎలాతయారయింది అనేది పూలబాల తన పేరడీ పద్యంలో ఇలా వ్రాసారు
Where the Mind full of fear – నేటి సమాజ స్థితిని వర్ణించే పేరడీ
Where the mind is full of fear
Where the mind is full of fear
and the head is held low
Where the knowledge is unimportant
and world is stolen by internet
Where people survive as groups
in social media where words come out
from preposterous chat by impostors
where ceaseless prowling stretches its arms
towards abduction where thinking
is permanently damaged
Where logic ceases and thinking dies
where education has no meaning
where personality succumbs to hero worship
where caste thrives and corruption flourishes
where religion rules the senses
where tradition serves the purpose of exploitation
where the mind is led forward by politics
into ever shrinking thought and faction,
into the nation of half alive zombies
my father, my country has awoken. – poolabala
సొనెట్ అంటే 14 లైన్ల ప్రౌఢ ఆంగ్ల పద్యం. అనేక ఆంగ్ల కవులు సొనెట్ వ్రాసి తమ సత్తా చాటుకున్నారు. సొనెట్ కి ప్రత్యేక రైమ్ కస్కీం ఉంది 14 లైన్ల పద్యము మాత్రమే సొనెట్ అనే అర్హత కలిగిఉంటుంది. 15 కానీ 16 కానీ లైన్లు గల పద్యానికి సొనెట్ అనిపించుకునే అర్హత లేదు. సొనెట్ లో మొదట 8 లైన్లను ఆక్ టెట్ అని తరువాతి 6 లైన్లను సెస్ టెట్ అని అంటారు. ఇలా నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ వ్రాసిన సొనెట్ లని తెలుగు భాషలో శార్ధూల మత్తేభ పద్యాలు వ్రాసినట్టు గణిస్తారు .
రెండు వందల సొనెట్స్ ను 2 నెలలలో వ్రాయడం ఆంగ్ల రచనా సాహిత్యంలో జరగలేదు. కృష్ణా యూనివర్శిటీ ఇంగ్లీష్ ప్రొఫెసర్ డాక్టర్ దిలీప్ “పూలబాల యొక్క భారతీయ , స్థానిక సంస్కృతులను మేళవించి, భారతీయుల మనోభావాలను ప్రతిబింబించే విధంగా వ్రాసిన సోనెట్లు గొప్ప అనుభూతిని కలుగ జేస్తాయని చిక్కటి రైమ్ స్కీమ్ గల ఈ లిరికల్ సోనెట్లు పాఠకులను వేరే ప్రపంచంలోకి తీసుకు పోతుందని తన ముందుమాటలలో పేర్కొన్నారు. పూలబాల వ్రాసిన ఈ సొనెట్స్ ను అకడమిక్ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవచ్చని ఆయన సూచించారు.
గన్నీస్ బుక్స్ ప్రపంచ రికార్డు హోల్డర్ మరియు రిటైర్డ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనాథ్ తన ముందుమాటలో పూలబాల యొక్క సొనెట్‌లు అంతర్గత మరియు అంతిమ ప్రాసతో అసమానమైన సాహిత్య సౌందర్యాన్ని సృష్టించిందని పేర్కొంటూ పూలబాలను గ్లోబల్ సోనెటీర్ సుప్రీం గా అభివర్ణించారు
అంబేద్కర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ పండిట్ విజయలక్ష్మి ప్రేమ, కామం, జననం, మరణం, దేశం, సంస్కృతి, వంతెన, నది, ఆవు, చీమ వంటి విభిన్న ఇతివృత్తాలతో పూబాల రాసిన సానెట్‌లు నేటివిటీ, మార్మికత, గొప్ప చిత్రాలతో హృదయానికి హత్తుకునేలా ఉన్నాయని అన్నారు. ఈ సొనెట్‌లు గొప్ప పదజాలం మరియు పదబంధాలతో పాఠకులను వేరే ప్రపంచానికి తీసుకెళ్తాయి.
షేక్స్పియర్ తన జీవిత కాలంలో 154 సొనెట్‌లను రాశాడు; రాబర్ట్ ఫ్రాస్ట్ తన జీవితకాలంలో వంద కవితలు రాశాడు. రూపర్ట్ బ్రూక్, ఎడ్వర్డ్ థామస్, థామస్ డైలాన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కవులు 200 సొనెట్‌లు రాయలేదు. పూలబాల ఇంత తక్కువ సమయంలో 200 సొనెట్‌లను రాయడం ప్రపంచంలోని అతిపెద్ద కవితా రచనలలో ఒకటిగా పరిగణించబడాలి.