ఫోర్త్ డైమన్షన్ అంటే ఏంటి?
మానవ ప్రపంచం అంతా 3 డి. ఇక్కడ వస్తువులకు పొడవు, వెడల్పు ఎత్తు లేదా లోతు ఉంటాయి.
ఇల్లు, భవనాలు పొడవు వెడల్పు కలిగి ఉంటే చెరువు ,
నీటి టేంకు వెడల్పు లోతు కలిగి ఉంటాయి. ఫోర్త్ డైమన్షన్ అంటే కాలం.
ఐన్‌స్టీన్ 4వ డైమెన్షన్‌ను అర్థం చేసుకోగలిగాడు. అతను తన థియరీ ఆఫ్ రెలెటివిటీ లో
వివరించగలిగాడు కానీ అనుభూతి చెందలేకపోయాడు. సామాన్యులకు ఫోర్త్ డైమెన్షన్ అర్థం
అవ్వడం కూడా కష్టమే. అర్థం అయితే ఒక వింత అనుభూతిని పొందుతారు.
మానవ జీవితం 3 డి నిర్మితం. 3 డి కె పరిమితం. అంటే మనుషులకు పొడవు వెడల్పు
ఎత్తు లేదా లోతు అనే మూడు కోణాలు తెలుస్తాయి.
2Dలో ఒక జీవిని ఊహించుకోండి. ఉదాహరణకు, కాగితంపై మనిషి యొక్క లైన్ ఆర్ట్ యానిమేషన్ చూసారా .ఆ మనిషి చెయ్యి చాచడం గీయాలంటే
కాగితం మీదే గీయాలి . కాయితం దాటి పైకి రాదు. చెయ్యిజాపినట్టు క్రాస్ సెక్షన్ లో నే గీస్తారు. 2 డి సినిమాలు కూడా అంతే కదా. థర్డ్ డైమన్షన్ ఉండదు.
3 డీ లో ఐతే ముందుకి వచ్చినట్టు చూపించవచ్చు ఒక పెద్ద పెట్టెలో ఒక నాణేన్ని పెట్టి ఆ నాణేన్ని పైకి లేపకుండా బైటకు తీయాలంటే పెట్టిని కత్తిరించడమే మార్గం.
నాణేన్ని పైకి లేపడం అంటే 3 డి వాడడం. ఈ మూడు డైమన్షన్స్ లో కదలడం మనుషులందరికీ సాధ్యమే అందుకే అలాచేసినా ఎవ్వరూ ఆశ్చర్యపోరు.
లోతైన నూతిలో నీళ్లు తాడు కట్టిన బకెట్ తో తోడటం లేదూ. 2 డి మాత్రమే తెలిసి 2 డి లో జీవించే జీవి కి ఇదంతా ఆశ్చర్యంగా ఉండమీ కాక మీరు
దేముడులా కనిపిస్తారు. 2 డి లో జీవులుండడం ఏంటి ? అని మీకు ఆశ్చర్యంగా ఉందా ? ఇప్పుడు 4 డి అంటే ఫోర్త్ డైమన్షన్ గురించి తెలుసుకుందాం
ఫోర్త్ డైమన్షన్ అంటే కాలం అనుకున్నాం కదా. ఫోర్త్ డైమన్షన్ లోకి అంటే కాలంలోకి ఎవరైనా వెళ్లగలిగితే మనం వారిని ఎలా చూస్తాం ?
4-D జీవి మనకు దేవుడు. వీరు గడిచిన కాలంలోకి వెళ్ళగలరు మీరు పెట్టెను కత్తిరించకుండా మూడవ డైమెన్షన్‌లోకి చెయ్యిపెట్టి లోపనున్న నాణేన్ని తొలగించినట్లుగా, ఇది మీ అల్పాహారాన్నిమీకు దక్క కుండా చేయగలదు లేదా మన మెదడులో కణితి పెరగకుండా నిరోధించవచ్చు.
ఒక స్త్రీ కి బిడ్డ పుట్టకుండా ఒక పువ్వు ఫలదీకరణం చెందకుండా నిరోధించవచ్చు. అమెరికాలో ట్విన్ టవర్స్ పై బిన్ లాడెన్ దాడిని జరగకుండా ( సెక్యూరిటీని అప్రమత్తం చేయడం ద్వారా) నిరోధించవచ్చు. కానీ మనిషి అలా చేయగలడా ? సాధ్యం అవుతుందా ?
మనం ఎప్పటికీ 3 డైమన్షన్స్ కే పరిమితం అయ్యామా?
హెచ్ జీ వెల్స్ టైమ్ మెషీన్ నవల చదివినా ఆదిత్య 369 తెలుగు సినిమా చూసినా
మనుషులకి ఆ ఊహ అయితే ఉందని తెలుస్తోంది. మనం 4Dని చేరుకోగలమా?