ఉర్దూ అకాడమీ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉర్దూ అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో వారోత్సవాలు: మంత్రి ఫరూక్
దేశ చరిత్రలోనే ఉర్దూ భాషాభివృషి కొరకు పాటు పడిన ఏకైక నాయకులు గౌ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని మైనారిటీ శాఖా మంత్రి ఫరూఖ్ ఉద్ఘాటించారు.
బుధవారం విజయవాడ షా జాహుర్ ముసఫిర్ ఖనలో ఉర్దూ అకాడమీ ఉద్యోగుల సమీక్షా సమావేశం లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రశాంగించారు. సమావేశానికి ఉర్దూ అకాడమీ చైర్మన్ మొహమ్మద్ ఫరూక్ శుబ్లీ అధ్యక్షత వహించారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ
భాషకు మతంతో సంబంధం లేదు అన్నారు.
ఉర్దూ అకాడమీ చరిత్రలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉర్దూ భాషాభివృద్ధికి నూతన అధ్యాయం లిఖిస్తాము:
ఉర్దూ అకాడమీ ఉద్యోగుల్లో పని చేసిన వారికి గుర్తింపు, చెయ్యని వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
చైర్మన్ ఫరూక్ శుబ్లీ మాట్లాడుతూ ఉద్యోగులంతా నా కుటుంబ సభ్యులు మరియు మీ కష్టాలను మా కష్టాలు అని అనుకునే విధంగా శక్తివంచన లేకుండా పని చెయ్యండి అని అన్నారు.
సీఎం గారి చేతుల మీదుగా బ్రోచర్ విడుదల చేసిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహిస్తామని అలాగే అధిక ప్రాధాన్యత రాయలసీమ ప్రాంతానికి ఇస్తామని అన్నారు.
159 మంది ఉద్యోగుల్లో 14 మంది గైర్హాజరైన వారికి తక్షణమే మెమో జారీ చెయ్యాలని అకాడమీ సెక్రటరీ గారికి ఆదేశించడం జరిగింది.
కూటమి ప్రభుత్వం మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉందని షిబ్లీ అన్నారు. అందులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్, యూత్ ఎంపవర్మెంట్, టెక్నాలజీ ద్వారా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరిచే విధంగా పని చేస్తామని అన్నారు.
వారోత్సవాలను సురూర్ ఎ ఉర్దూ మహోత్సవ్ పేరుతో ఈనెల 16 నుండి 20 వరకు నిర్వహిస్తామని అన్నారు.
మీరు ఉర్దూ అకాడమీ ఉద్యోగులు కాదు కల్చరల్ అంబాసిడర్ అనగా (సాంస్కృతిక రాయబారి) అని చైర్మెన్ ఫరూఖ్ షిబ్లీ స్పష్టం చేశారు. ఉర్దూ భాష, సంస్కృతి ఇది మనందరి భారతదేశ వారసత్వం అని అన్నారు.
రానున్న 90 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అకాడమీ లైబ్రరీ సెంటర్లను, కంప్యూటర్ సెంటర్లను స్వయంగా చైర్మెన్ గారే పర్యటనలు చేస్తారని అన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో మైనార్టీ ప్రిన్సిపల్ సెక్రెటరీ సిహెచ్ శ్రీధర్ గారు, ఉర్దూ అకాడమీ సెక్రటరీ గౌస్ పీర్ గారు, APSMFC ఎండి యాకూబ్ భాష, రాష్ట్రవ్యాప్త ఉర్దూ అకాడమీ ఉద్యోగులు పాల్గొన్నారు.













































