నియోజకవర్గంలో 40 ఎకరాల్లో సొంత ఖర్చుతో ప్రకృతి వ్యవసాయం చేసి రైతులకు ఉచితంగా పంట ఇస్తా
లాభ దాయకంగా ఉండే పంట వేయాలి
యాంత్రీకరణ వ్యవసాయంతో లాభం
నూజివీడు/ఆగిరపల్లి/నవంబరు:03
నూజివీడు నియోజకవర్గం ఆగిరపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం గ్రామంలో నిర్వహించిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తొలుత ప్రకృతి వ్యవసాయ శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్ల్స్ ప్రదర్శించి వివరాలు అడిగి తెలుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ గత వ్యవసాయానికి నేటి వ్యవసాయానికి చాలా తేడా ఉందని రైతులు లాభసాటి పంటను వేయాలని అన్నారు. ప్రస్తుతం కాలంలో కూలీల కొరత ఎక్కువగా ఉన్నందున యాంత్రిక శక్తి ఉపయోగించుకోవాలని కోరారు. రైతులకు రోటవేటర్, డ్రోన్, ట్రాక్టర్లు, ఇలా పలు వ్యవసాయ పనిముట్లు ప్రభుత్వం రాయితీ పై అందిస్తుందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అలాగే నీటిని సద్వినియోగం చేసుకోవాలని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు చేస్తే నీటి వినియోగం తగ్గి లాభసాటిగా ఉంటుందన్నారు. డిమాండ్ ఉన్న పంటలు వేయాలని ఉదా:వరి తగ్గించి ఫామాయిల్,కోకో, మొక్కజొన్న,ఇలా వాణిజ్య పంటలు సాగుచేస్తే వ్యవసాయం లాభ సాటిగా ఉంటుందన్నారు. అంతర్ పంట కూడా వేస్తే రైతు లాభాలు గడించ వచ్చన్నారు.
రైతుల అవగహన సదస్సులో పాల్గొని వ్యవసాయ సాగులో మెలుకవలు తెలుసుకోవాలని అన్నారు.గత ప్రభుత్వం రైతుకు 1 రూ.కూడా ఇవ్వకుండా వ్యవసాయాన్ని తుంగలో తొక్కిందని కూటమి ప్రభుత్వం ధాన్యం కొన్న 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్భు జమ చేస్తుందన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయ ఋణాలు 1 రూ.కూడా ఇవ్వలేదని కూటమి ప్రభుత్వం డ్రోన్లు,రోటవేటర్లు, ఇలా పలు వ్యవసాయ యంత్రాలు పనిముట్లు 50 శాతం 90 శాతం సబ్సిడీ తో కూటమి ప్రభుత్వం ఋణాలు అందిస్తుందన్నారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనుభవం ఉన్న శాస్త్ర వేత్తలు పరిశోధించిన తరువాత మాత్రమే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని రైతులు అర్థం చేసుకొని ఎరువులు వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయం, మరియు ఆధునిక వ్యవసాయం అలవాటు చేసుకోవాలని కోరారు. అన్న దాత సుఖీభవ ద్వారా రూ.20 అందిస్తున్నామని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.మామిడి రైతులకు పేను సమస్య ఎక్కువగా ఉన్నందున 4 నెలల ముందుగానే పరిష్కరించుకోవాలి తెలిపారు. ఖరీఫ్ లో మునుపెన్నడూ లేని విదంగా నియోజకవర్గ పరిధిలోని చెరువుల అన్నీ నీటితో నింపామని దానితో రైతులంతా ఆనందంగా పంటలు విత్తారని తెలిపారు. గత 18 నెలల కాలంలో సుమారు.200 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసానని ఆర్&బి సి, సి, రోడ్లు చెరువుల మరమ్మత్తులు, ప్రభుత్వ భవనాలు నిర్మాణం ఇలా కూటమి ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. త్వరలో చింతలపూడి కాలువ పనులు పూర్తి చేసి నియోజక వర్గాన్ని శస్య శ్యామలంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి అభివృద్ధి చేస్తుందని మొన్న జరిగిన విశాఖ C I I సదస్సులో సుమారు. రూ.13.50.లక్షల కోట్ల ఒప్పందం జరిగిందని వాటిలో సుమారు.రూ.50 కోట్లు ఫుడ్ ప్రోసెసింగ్ పరిశ్రమలకే ప్రభుత్వం నిధులు కేటాయించిదని తద్వారా యువతకు లక్షల్లో ఉద్యోగ ఉపాది అవకాసాల లభిస్తాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే బహుళ జాతి సంస్థలు రూ.9లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాయని తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగి రాష్ట్రం అభివృద్ధి పధంలో నడుస్తుందన్నారు. నియోజకవర్గంలో ప్రతీ ఎకరాకు నీరందించాలాని.ప్రతీ గింజ ప్రభుత్వం కొనాలని అధికారులకు ఆదేశించిన మంత్రి. భూగర్భ జలాలు పెరిగే విదంగా ఇంకుడు గుంటలు, చెరువులు నింపాలని రైతులకు అధికారులు చూసించారు.అటు రైతులు ఇటు అధికారులు సమన్వయంతో అవగహన తో వ్యవసాయం చేస్తే లాభాలు గడించి ఆర్ధికంగా అభివృద్ధి చెందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్, బి, వినూత్న, అగ్రికల్టర్, జే, డి, Sk, అబీబ్ భాష, తహశీల్దార్ ప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారులు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, వేణు, రఘు, వేంకటేశ్వరరావు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.














































