ఇన్నోవేషన్స, సస్టైనబుల్ బిజినెస్ ప్రాక్టీసెస్ ఇన్ డిజిటల్ ఎరా సదస్సు
విఐటి -ఏపి విశ్వవిద్యాలయంలో ఇన్నోవేషన్ మరియు సస్టైనబుల్ బిజినెస్ ప్రాక్టీసెస్ ఇన్ డిజిటల్ ఎరా పై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు
అమరావతి: విఐటి -ఏపి విశ్వవిద్యాలయంలోని, విఐటి -ఏపి స్కూల్ ఆఫ్ బిజినెస్, న్యూకాజిల్ విశ్వవిద్యాలయం (ఆస్ట్రేలియా) ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బెటర్ ఫ్యూచర్ (ఆస్ట్రేలియా) సంయుక్త సహకారంతో ఇన్నోవేషన్ , సస్టైనబుల్ బిజినెస్ ప్రాక్టీసెస్ ఇన్ డిజిటల్ ఎరా అనే అంశంతో రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు 5 ఏప్రిల్ 2024 న ప్రారంభమయ్యింది. ఈ సదస్సులో నేటి డిజిటల్ యుగంలో ఇన్నోవేషన్ , సుస్థిరత లక్ష్యాలపై కీలక ప్రసంగాలు, ప్యానెల్ చర్చలు, సాంకేతిక సెషన్ , ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహిస్తారు. వ్యాపార వృద్ధి , పర్యావరణ సారథ్యం రెండింటినీ ప్రోత్సహించే అత్యాధునిక వ్యూహాలు, సాంకేతికతలు ,ఆదర్శప్రాయమైన పద్ధతులను అన్వేషించడానికి ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. సృజనాత్మకత, ఆవిష్కరణ , వ్యవస్థాపకత యొక్క ప్రాముఖ్యత గురించి ఉపాధ్యాయులు ,విద్యార్థులలో అవగాహన పెంచడమే ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశ్యం
ఈ సదస్సుకు హాజరైన అతిధులకు, విద్యార్థులు, డా. అరుణ్‌కుమార్ శివకుమార్ (డీన్ ఇన్‌చార్జి, విఐటి-ఏపి స్కూల్ అఫ్ బిజినెస్) స్వాగతం పలికారు , ఈ అంతర్జాతీయ సదస్సులో 9 టెక్నికల్ సెషన్‌లలో మొత్తం 109 పేపర్లు సమర్పించబడ్డాయని తెలియచేసారు. డా. సుహైల్ అహ్మద్ భట్ ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని వివరించారు.
విఐటి-ఎపి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా.ఎస్ వి కోటా రెడ్డి మాట్లాడుతూ అనేక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు , పరిశ్రమలతో చేసుకున్న ఎంఒయులు విశ్వవిద్యాలయానికి తలామణికమని ప్రశంసించారు. విశ్వవిద్యాలయంలోని ఇన్నోవేషన్ ,ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా విధ్యార్ధులలోని యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు నిధులను కూడా అందచేస్తున్నామని ఈ సౌకర్యాలను విఐటి-ఎపి విశ్వవిద్యాలయంలోని ప్రతి విద్యార్థి ఉపయోగించుకోవాలని కోరారు. 2023 సంవత్సరంలో 1050 కంటే ఎక్కువ పరిశోధనాత్మక ప్రచురణల ,500 కంటే ఎక్కువ పేటెంట్‌లను దాఖలు చేసిన ఘనత విఐటి-ఎపి విశ్వవిద్యాలయం సాధించిందని తెలియచేసారు.
విఐటి-ఎపి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా.జగదీష్ చంద్ర ముదిగంటి మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో అవలంబించాల్సిన స్థిరమైన విధానాల గురించి వివరించారు. పాలసీ , రిస్క్ మేనేజ్‌మెంట్‌తో కూడిన ఆవిష్కరణల స్థిరత్వాన్ని నిర్థేశించటానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ముఖ్య అతిథి పాప్స్ ముప్పా (డిజైన్ రిక్రూటింగ్, జెపి మోర్గాన్ చేజ్, యూఎస్ఏ ) మాట్లాడుతూ ప్రస్తుత వ్యాపార రంగంలో జరుగుతున్న సాంకేతిక మార్పుల గురించి సదస్సులో పాల్గొన్నవారికి అవగాహన కల్పించారు. నేటి అభివృద్ధి చెందుతున్న డిజిటల్ యుగంలో వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి సృజనాత్మక ఆవిష్కరణలు , స్థిరత్వం అనివార్యంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు. అటువంటి సహకార ప్రయత్నాలను ప్రోత్సహించడం సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కోవడంలో ,సానుకూల మార్పును తీసుకురావడంలో అంతర్జాతీయ సహకారం యొక్క ప్రాముఖ్యతను తెలియచేసారు.
గౌరవ అతిథి డా. మార్డీ చియా (అసోసియేట్ ప్రొఫెసర్, న్యూకాజిల్ బిజినెస్ స్కూల్, ఆస్ట్రేలియా) మాట్లాడుతూ ఆర్థిక వ్యాపార నమూనాలలో సుస్థిరత గురించి ప్రసంగించారు , ప్రస్తుత యుగంలో ఫిన్‌టెక్ , డిజిటల్ ఆర్థిక అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీంద్ర ధూలీ (డీన్-రీసెర్చ్, విఐటి -ఏపీ విశ్వవిద్యాలయం ) జయశ్రీ గోపాల్ (న్యూ కాజిల్ యూనివర్సిటీ), డా.సీతాలక్ష్మి, డా. మొహమ్మద్. అబ్దుల్ ముఖీత్ మాజ్ ,వివిధ విశ్వవిద్యాలయకు చెందిన ప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.