4-06-2023
విశాఖపట్నం
కోరమాండల్, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రిజర్వేషన్ ప్రయాణికుల్లో ఒక్కరు తప్ప అందర్నీ ట్రేస్ చేశాం
వివరాలు వెల్లడించిన మంత్రి బొత్స సత్యన్నారాయణ
విశాఖపట్నం:
– ఒడిశాలోని బాలాసోర్‌లో రైలు దుర్ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించిన మంత్రి బొత్ససత్యన్నారాయణ.
– సీఎం ఆదేశాలమేరకు విశాఖపట్నంలో ఉండి.. ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించిన మంత్రి బొత్స.
– కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో రాష్ట్రానికి రావడానికి రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు 513 మంది: మంత్రి బొత్స
– యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో రాష్ట్రం నుంచి వివిధ స్టేషన్లలో ఎక్కిన వారు 270:
– మొత్తంగా రెండురైళ్లలో రాష్ట్రానికి వస్తున్నవారు, రాష్ట్రం నుంచి వెళ్తున్న ప్రయాణికుల సంఖ్య 783:
– ఇందులో ఒకరు ఎక్కడున్నారో తెలియడంలేదు, మరో వ్యక్తి- బాలాసోర్‌లో ఉంటున్న శ్రీకాకుళం వాసి గురుమూర్తి మరణించిన విషయం విదితమే:
– వీరు ఇద్దరు పోను మిగిలిన 781 మందితో ఫోన్ల ద్వారా మాట్లాడాం:
– ఈ 781 మందిలో 92 మంది ప్రయాణాలు రద్దు చేసుకున్నారు:
– ప్రమాదంలో గాయపడ్డవారు 22 మంది:
– 11 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు:
– 9 మంది విశాఖపట్నంలో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు:
– ఒకరు భువనేశ్వర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు:
– మరొకర్ని భువనేశ్వర్ అపోలో ఆస్పత్రి నుంచి విశాఖ అపోలో ఆస్పత్రికి తరలిస్తున్నారు:
– ఒడిశాకు మంత్రి అమర్నాథ్ సహా, ముగ్గురు ఐఏఎస్‌లు, ముగ్గురు ఐపీఎసల్ బృందాన్ని ముఖ్యమంత్రిగారు పంపించారు:
– దీంతోపాటు సీఎంగారి సూచన మేరకు ప్రతి జిల్లాకలెక్టర్ కార్యాలయాల్లో కూడా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు:
– అంతేకాకుండా రైల్వేశాఖ నుంచి కూడా సమాచారం తీసుకున్నాం:
– వారి వారి ఫోన్ నంబర్ల ఆధారంగా ఒక్కొక్కర్నీ ట్రేస్ చేస్తూ వచ్చాం:
– ఈ రకంగా మొత్తం రిజర్వేషన్ కేటగిరీ ప్రయాణికులందర్నీకూడా ట్రేస్ చేశాం:
– ఈ మొత్తం ఆపరేషన్ అంతటినీ విశాఖపట్నం నుంచి పర్యవేక్షించాం:
– ఇంకా ఎవరైనా తమ బంధువులు, సన్నిహితులు కనిపిచండంలేదని సమాచారం వస్తే… వారి వివరాలుకూడా కనుక్కుంటాం: