TOEFL EXAM PREPARATION FROM PRIMARY SCHOOL LEVEL-ప్రిపరేటరీ సప్రాథమిక స్థాయి నుండే విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టోఫెల్ కు సంబంధించినర్టిఫికేషన్ పరీక్షలు…
ప్రపంచ స్థాయి పౌరులుగా రాష్ట్ర విద్యార్థులను తీర్చిదిద్దేందుకు, ప్రిపరేటరీ సప్రాథమిక స్థాయి నుండే విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టోఫెల్ కు సంబంధించినర్టిఫికేషన్ పరీక్షలు ఏప్రిల్ 10న (రేపు) నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 13,104 పాఠశాల
ల్లో 3 నుండి 5వ తరగతి వరకు చదువుతున్న 4,53,265 మంది విద్యార్థులు ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్(ఈటీ ఎస్, ప్రిన్స్ టన్, యు.ఎస్.ఏ) నిర్వహించే టోఫెల్ ప్రిపరేటరీ సర్టిఫికేషన్ పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. అదే విధంగా ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం 5,907 పాఠశాలలకు చెందిన 6-9 తరగతులు చదువుతున్న 16,52,142 మంది విద్యార్థులు కూడా ఈటీఎస్ నిర్వహించనున్న టోఫెల్ ప్రిపరేటరీ సర్టిఫికేషన్ పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు.
పరీక్ష మూల్యాంకనం తర్వాత ఆయా విద్యార్థులకు ప్రిన్స్ టన్, యు.ఎస్.ఏ యొక్క ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ నుండి సర్టిఫికేట్ ఇవ్వబడుతుందని వివరించారు.
టోఫెల్ పరీక్ష కోసం ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానెల్‌లు, స్మార్ట్ టీవీలు వినియోగించనున్న నేపథ్యంలో వాటి పనితీరుపై దృష్టి సారించాలని డీఈఓలకు సూచించారు.
జిల్లాల్లో అత్యుత్తమ పాఠశాలలుగా ఉండేందుకు, తీర్చిదిద్దెందుకు పాఠశాలల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణానికి ఇది ఉపకరిస్తుందన్నారు. ప్రతి పాఠశాల మంచి స్థాయి లో ఉండాలని సూచించారు.
ఒక ఏడాది చివరి స్థానం లో ఉన్న పాఠశాల మరో ఏడాది మొదటి స్థానంలో ఉండవచ్చన్నారు. విద్యార్థుల్లో మంచి నైపుణ్యాలు, బంగారు భవిష్యత్ కల్పించడంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, విద్యార్థులను ఆత్మవిశ్వాసంతో తీర్చిదిద్ది పోటీ పరీక్షల్లో రాణించేలా చిన్న నాటి నుంచే టోఫెల్ పరీక్షకు సిద్ధం చేయడం తమ లక్ష్యం అన్నారు.
టోఫెల్ ప్రిపరేటరీ సర్టిఫికేషన్ పరీక్షలు రాస్తున్న సందర్భంగా ప్రవీణ్ ప్రకాష్ విద్యార్థులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు..