దివ్యాంగులు సంక్షేమం, అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.
అర్హులు అయిన దివ్యాంగులు అందరికీ ఉపకరణాలు, పింఛన్లు మంజూరు చేస్తాము.
24 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్స్ పంపిణీ.
రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి …
ఏలూరు/ నూజివీడు, నవంబరు 05: నూజివీడు మండలం నూజివీడు మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం 24 మందికి దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్స్ ను రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ దివ్యాంగులు సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. వారిని సమాజంలో అందరితో గౌరవంగా జీవించేలా రాష్ట్ర ప్రభుత్వం నుండి అన్ని పథకాలు అందించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అర్హులు అయిన దివ్యాంగులు అందరికీ ఉపకరణాలు, పింఛన్లు అందిస్తున్నామని, ఇంకా అర్హులు ఉన్నచో సమీప యంపిడివో కార్యాలయంలో గాని సచివాలయంలో గాని ధరఖాస్తులు ఇవ్వాలని అన్నారు. దివ్యాంగులకు ప్రేమా ఆప్యాయతలు పంచి మనతో పాటు సమానంగా సమాజంలో అన్ని రంగాల్లో ముందుకు సాగేలా మనమంతా సమష్టిగా కృషి చేద్దామన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖలు అధికారులు, సచివాలయ, వివిధ శాఖల ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, దివ్యాంగులు వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.













































