- పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ పూర్తి చేసిన ఏపీ ప్రభుత్వం
- ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం
- సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారితో రేపు సమావేశం కానున్న సిఎం చంద్రబాబు
- మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం
అమరావతి:
పోలీసు శాఖలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియను కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. గత ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతో సరిపుచ్చిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిచేసింది. 6,100 మందిని రిక్రూట్ చేసుకునేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో 6,014 మంది సెలక్ట్ అయ్యారు. వీరిలో 5,757 మంది ట్రైనింగ్ కు ఎంపిక అయ్యారు. సివిల్ కానిస్టేబుళ్లుగా 3,343 మంది, APSP కానిస్టేబుళ్లుగా 2,414 మంది ఎంపికయ్యారు. సివిల్ లో మహిళా కానిస్టేబుళ్లు 993 మంది ఉన్నారు. వీరందరికీ ఈ నెల నుంచి ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభం అవుతుంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు శాఖలో నూతనంగా జాయిన్ అవుతున్న వారితో మంగళవారం సమావేశం కానున్నాను. మంగళగిరి ఎపిఎస్పీ 6వ బెటాలియన్ ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ లో ఉన్న నోటిఫికేషన్ ను పూర్తి చేసి ఉద్యోగాల భర్తీ చేపట్టింది. కొద్ది నెలల క్రితం మెగా డీఎస్సీ నిర్వహించి 15,941 మందికి ఉద్యోగాలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం… నేడు 6,104 పోస్టులతో పోలీసు శాఖలో ఖాళీలను భర్తీ చేసింది. నిరుద్యోగ యువతను మభ్య పెట్టడానికి గత ప్రభుత్వం మొక్కుబడిగా నోటిఫికేషన్ ఇచ్చింది. నియామకాల దగ్గరకు వచ్చే సరికి తీవ్ర నిర్లక్ష్యం, అలసత్వం చూపించింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యపై దృష్టి పెట్టింది. రిక్రూట్మెంట్ పై దాఖలైన 31 రిట్ పిటిషన్లు న్యాయస్థానాల్లో చట్టబద్ధంగా సమాధానం చెప్పి సమస్యను పరిష్కరించింది. పరీక్షలు కూడా రికార్డ్ టైమ్‌లో పారదర్శకంగా నిర్వహించారు. 60 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించారు. ఇప్పటికే అభ్యర్థులు ఆయా జిల్లాల్లో నియామక పత్రాలు తీసుకున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన వారితో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమానికి కొత్తగా ఎంపికైన ఉద్యోగులు, వారి తల్లిదండ్రులు కూడా హాజరవుతారు. పోలీసు శాఖలోకి కొత్తగా వస్తున్న వారికి స్వాగతం పలికేందుకు, వారికి శుభాకాంక్షలు తెలిపేందుకు స్వయంగా సిఎం ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నారు. ఈ నెల 22 నుంచి వారికి ట్రైనింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది.













































