స్విట్జర్లాండ్:- దావోస్ పర్యటన ముగించుకుని స్వదేశానికి బయల్దేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
రేపు ఉదయం 8.25 నిముషాలకు హైదరాబాద్ కు చేరుకోనున్న ముఖ్యమంత్రి
మొత్తంగా నాలుగు రోజుల దావోస్ పర్యటనలో 36కు పైగా కార్యక్రమాలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు
ఇజ్రాయెల్, యూఏఈ, స్విట్జర్లాండ్ దేశాల ప్రతినిధులతో 3 సమావేశాల్లో పాల్గోన్న సీఎం
ప్రపంచ ఆర్ధిక సదస్సు వేదిక వద్ద ఆర్సెలార్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, ఐబీఎం సీఈఓ అర్వింద్ కృష్ణ సహా 16 దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి సమావేశం
ప్రపంచ ఆర్ధిక సదస్సులో నిర్వహించిన 9కి పైగా సెషన్స్, సమావేశాలకు హాజరైన సీఎం
వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక నుంచి ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక రంగ పోకడలు, పారిశ్రామిక వేత్తల ఆలోచనలు తెలుసుకునేందుకు ఉపకరించాయని అభిప్రాయం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను మరింత విస్తరించేందుకు రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పాలసీలను అంచనా వేసేందుకు కూడా సదస్సు దోహదం చేసిందన్న ముఖ్యమంత్రి
2025 దావోస్ పర్యటన ద్వారా ఇప్పటికే రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు సాకారం అయ్యాయని అభిప్రాయపడిన ముఖ్యమంత్రి
మూడు రోజుల పాటు జరిగిన సమావేశాల ద్వారా గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వ్యవసాయం, టూరిజం వంటి రంగాల్లో ఏపీ సాధిస్తున్న విజయాలను వనరుల్ని సమర్ధంగా లు వివరించగలిగామన్న సీఎం
గతంతో పోల్చుకుంటే ప్రపంచ దిగ్గజ సంస్థలు భారత్ వైపు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయన్న ముఖ్యమంత్రి
యువ శక్తి, సమర్థ నాయకత్వం, పాలసీల కారణంగా ప్రస్తుతం ప్రతీ రంగంలో భారత్ లో కంపెనీలకు అవకాశాలు పెరుగుతున్నాయని అభిప్రాయపడిన సీఎం
యూరప్ లోని తెలుగు ప్రజలతో మమేకం అవుతూ తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొని వారిలో ఆత్మవిశ్వాసం నింపిన సీఎం చంద్రబాబు
దావోస్ వేదికగా జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులకూ ప్రత్యేక ఇంటర్వూలు ఇచ్చిన ముఖ్యమంత్రి
రేపు ఉదయం 8.25 గంటలకు హైదరాబాద్ చేరుకుని.. అక్కడి నుంచి అమరావతికి బయల్దేరనున్న సీఎం
11.30 గంటల నుంచి అమరావతి సచివాలయంలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు





















































