పరమతాల ఉచ్చులో పడొద్దు
– ఆదివాసీలకు స్వాత్మానందేంద్ర హితవు
– అల్లూరి ఏజెన్సీలో పర్యటించిన ఉత్తరాధికారి
విశాఖ:
మత ప్రబోధకులు చూపించే కపట ప్రేమను ఆదివాసీలంతా గమనించాలని, పరమతాల ఉచ్చులో పడొద్దని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి అన్నారు. అన్యమతాల ప్రలోభాలకు లొంగొద్దని, కన్నతల్లి లాంటి స్వధర్మాన్ని ఆచరించాలని సూచించారు. ఆదివారం అల్లూరి సీతారామరాజు ఏజెన్సీలో ఆయన పర్యటించారు. తొలుత పాడేరులోని మోదకొండమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. అక్కడి నుండి హుకుంపేట మండలం తడిగిరి పంచాయతీ ఉక్కుర్భ గ్రామానికి వెళ్ళారు. అక్కడ గిరిజనులు నిర్మించుకున్న భీమలింగేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. ఆలయ నిర్వహణ పట్ల గిరిజనులు చూపుతున్న శ్రద్ధాసక్తులను చూసి సంతోషం వ్యక్తం చేసారు. ఎంత ఖర్చయినా వెనుకాడకుండా ఆలయానికి కరెంటు సదుపాయం కల్పించాలని అక్కడే ఉన్న అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గుణకు సూచించారు.
ఈసందర్భంగా స్వాత్మానందేంద్ర స్వామి ఆదివాసీలను ఉద్దేశించి మాట్లాడారు. గిరిజన ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడి ఉండొచ్చు గానీ, విజ్ఞతను చూపడంలోను, ఆదరాభిమానాలను చాటడంలోను గిరిజనులు ముందుంటారని ప్రశంసించారు. ఆదివాసీలు అదృష్టవంతులని, ఎక్కడో అయోధ్యలో ఉండే రామచంద్ర ప్రభువు గిరిజనులతో కలిసి జీవించడమే దీనికి నిదర్శనమని చెప్పారు. పదిమందికి సాయపడాలని హిందూ ధర్మం బోధిస్తోందని అన్నారు. గిరిజనులంతా నిత్యం భగవన్నామ స్మరణతో గడపాలని, ఆలయాలను దర్శించాలని సూచించారు.
విశాఖ శ్రీ శారదాపీఠం చొరవతో తిరుమల తిరుపతి దేవస్థానం అల్లూరి ఏజెన్సీలో అనేక ఆలయాలను నిర్మించిందని గుర్తు చేసారు. స్వాత్మానందేంద్ర స్వామి వెంట వీ హెచ్ పీ నాయకులు, సమరసత సేవా ఫౌండేషన్ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ రాధాకృష్ణ, పలు ధార్మిక సంఘాల కార్యకర్తలు, బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రతినిధులు, గిరిజన సంఘాల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Don’t fall into the trap of perfection, Swatmanandendra Calls on Adivasis
– Swatmanandendra Hitavu for Adivasis
– A visiting officer in the Alluri Agency
Visakha: Swatmanandendra Swamy, Uttaradhikari of Visakha Sri Sarada Peetha said that all the tribals should be aware of the hypocritical love shown by religious preachers and not fall into the trap of paramats. It is advised not to succumb to the temptations of pagan religions and practice self-righteousness like Kannathalli. He visited Alluri Sitaramaraj Agency on Sunday. First visited Modakondamma Ammavari temple in Paderu and performed puja. From there they went to Ukkurbha village of Tadigiri Panchayat of Hukumpet mandal.
Participated in the annual celebrations of Bhimalingeswara Swamy temple built by the tribals there. He expressed happiness to see the interest shown by the tribals towards the maintenance of the temple. Araku, who was there, advised MLA Shetty Palguna to provide electricity to the temple without hesitation at any cost. On this occasion, Swatmanandendra Swamy addressed the Adivasis. Tribal areas may be lagging behind in development, but tribals are ahead in showing wisdom and showing kindness. It is said that the tribals are lucky and the proof of this is that Lord Ramachandra Prabhu lives with the tribesmen somewhere in Ayodhya.
He said that Hindu Dharma teaches to help ten people. All the tribals are advised to spend their time in remembrance of God and visit the temples. He recalled that Tirumala Tirupati Devasthanam has constructed many temples in Alluri Agency under the initiative of Visakha Sri Saradapitha. Along with Swatmanandendra Swamy, VHP leaders, Samarasatha Seva Foundation Uttarandhra Districts Convener Radhakrishna, activists of various charitable organizations, representatives of Brahmakumaris organization and leaders of tribal organizations participated in the program.