599 మార్కుల వెనుక కథ
కులం గురించి ఎవ్వరూ మనం పట్టించుకున్నంతగా ఎవ్వరూ పట్టించుకోరు. కులం అంటే మనం పడి చస్తాం. పి. వి. సింధు కులం ఏంటని ఇంటెర్నెట్ని వేటాడిన మూర్కులం మనం కాదా ? మనకి మార్కుల పిచ్చి కూడా కులం పిచ్చిలా పట్టింది. జర్మనీ లో ఉద్యోగం చేస్తున్న నా విద్యార్థిని ఇలా అంది. “నేను ఎన్ని ఇంటర్వూస్ కి వెళ్లినా నా గ్రేడ్ లు మార్కులగురించి ఎవ్వరూ అడగలేదు. ”
కానీ ఇక్కడ మాత్రం ఒక విద్యార్థికి 599 మార్కులు వస్తే చెంకలుగుద్దుకునే వాళ్ళు మురిసి ముక్కలైపోయేవాళ్లు చాలామంది ఉన్నారు.
ఇన్ని మార్కులు ఏంసూచిస్తున్నాయి?
ఇన్ని మార్కులు వచ్చిన వారు మేథావులని మన అభిప్రాయమైతే మనంత వెర్రివాళ్ళు , మూర్ఖులు ఎవరూ ఉండరు .ఆలోచన చేయండి ఇన్ని మార్కులు గుడ్డి చదువు ను సూచించడంలేదా ? మనకి బుర్ర మందగించి ఆలోచన నశించి ఇలా తయారయ్యాం. మార్కులు మార్కులు అని చచ్చిపోతున్నాం కానీ ఇన్ని మార్కులు వచ్చిన వాళ్లకి సామాజిక స్పృహ సున్నా ఉంటుంది.
ఇన్ని మార్కులు ఇంకా ఏంసూచిస్తున్నాయి?
విద్యావ్యస్థలో లోపాన్ని ఖచ్చితంగా చూపిస్తున్నాయి. ఇంగ్లీషులో తెలుగులో , సైన్స్ లో వందకి వంద వెయ్యడానికి కుదరదు. ఒక్క స్పెల్లింగ్ తప్పులేకుండా ఒక్క సెంటెన్స్ స్ట్రక్చర్ తప్పులేకుండా రాయడం సాధ్యమేనా ? కళ్ళుమూసుకుని దిద్దితే ఇలా మార్కులు వస్తాయి
ఇన్ని మార్కులు ఇంకా ఏంసూచిస్తున్నాయి?
విద్యాసంస్థల ఫ్రాడ్ ని కూడా సూచిస్తున్నాయి.
ఇన్ని మార్కులు ఇంకా ఏంసూచిస్తున్నాయి?
మార్కుల రేట్ రేస్ ని సూచిస్తున్నాయి.
90 మార్కులు వస్తే బాగా చదివేదానుకుంటారు . 99 మార్కులు వస్తే అద్భుతం అనుకుంటారు. వందకి వంద వస్తే ఫ్రాడ్ అనుకుంటారు.
సౌదీ అరేబియాలో ఒంటెల వెనుక పిల్లలని కట్టి ఒంటెల పందెం నిర్వహించే వ్యాపారులు గుర్తుకొస్తున్నారు