రాజధానిలో పచ్చదనం అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం
మాస్టర్ ప్లాన్ ప్రకారం 30 శాతం బ్లూ అండ్ గ్రీన్ రాజధానిగా అమరావతి నిర్మాణం
అమ్యూజ్ మెంట్ పార్కులు,ఎకో రిసార్ట్స్,స్నో వరల్డ్,పబ్లిక్ పార్కులతో ఆహ్లాదకరంగా అమరావతి
జనవరి నెలాఖరు నుంచి బ్యుటిఫికేషన్ పనులు ప్రారంభం
రాజధాని రైతుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం
ల్యాండ్ పూలింగ్ రైతుల కోసం సీఆర్డీఏ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటుచేస్తాం
…………ప్రెస్ మీట్ లో మంత్రి నారాయణ……….
అమరావతి…
తేది…03-12-2025.
అమ్యూజ్ మెంట్ పార్కులు,ఎకో రిసార్ట్స్,మ్యూజికల్ ఫౌంటెయిన్స్,స్కో వరల్డ్,..ఇలా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా రాజధాని అమరావతిలో ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు…అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధానిలో 30 శాతం బ్లూ అండ్ గ్రీన్ ఉండేలా ప్రణాళికలు రూపొందించామన్నారు…రాజధానిలో జరుగుతున్న నిర్మాణాలు,రోడ్ల పనులతో పాటే పచ్చదనం అభివృద్ది పనులు ప్రారంభిస్తామన్నారు..అమరావతిలో పచ్చదనం అభివృద్దిపై రాయపూడిలోని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష చేసారు..ఆ తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడారు…
అమరావతిలో ట్రంక్ రోడ్లు,ఎల్పీఎస్ జోన్లలో రోడ్లకు ఇరువైపులా,డివైడర్ మధ్య,రిజర్వాయర్ల చుట్టూ పచ్చదనం పెంపొందించేలా ప్రణాళికలు రూపొందించాం..217 చ.కిమీ మాస్టర్ ప్లాన్ లో బ్లూ అండ్ గ్రీన్ కు 30 శాతం కేటాయించాం…34 ట్రంక్ రోడ్లకు ఇరువైపులా 640 కిమీ మేర,అలాగే సెంట్రల్ డివైడర్ ల మీద 450 కిమీ మేర బ్యుటిఫికేషన్,22 ట్రంక్ రోడ్ల బఫర్ జోన్ లలో 133.31 కిమీ మేర అవెన్యూ ప్లాంటేషన్,ఎల్పీఎస్ జోన్ల వద్ద 1244 కిమీ మేర పచ్చదనం అభివృద్ది చేస్తున్నాం..శాకమూరులో 190 ఎకరాల్లో,మల్కాపురం వద్ద 21 ఎకరాల్లో పబ్లిక్ రిక్రియేషన్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి…అనంతవరం వద్ద 31 ఎకరాల్లో లంగ్ స్పేస్ పార్కులు,కురగల్లు వద్ద 200 ఎకరాల్లో బయో డైవర్సిటీ పార్కు ఏర్పాటుచేస్తున్నాం.ఇవికాకుండా ఎల్పీఎస్ జోన్లలో 1602 ఎకరాల మేర ఎకరం నుంచి పదెకరాల లోపు విస్తీర్ణంలో పార్కులు నిర్మిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
కృష్ణాయపాలెం రిజర్వాయర్ వద్ద 71 ఎకరాలు,నీరుకొండ రిజర్వాయర్ వద్ద 158 ఎకరాల్లో పచ్చదనం అభివృద్ది చేస్తున్నాం.శాఖమూరు పార్కులో 30 ఎకరాల్లో అమ్యూజ్ మెంట్ పార్కు అభివృద్ధి చేస్తున్నాం…
రిజర్వాయర్ లలో బోటింగ్ డక్,మ్యూజికల్ ఫౌంటెయిన్ అలాగే ఎడ్వంచర్ పార్క్ లో స్కో వరల్డ్,ఎకో రిసార్ట్స్ లో 10 ఎకరాల్లో కన్వోన్షన్ సెంటర్లు,రెస్టారెంట్స్,బోటింగ్,కాటేజీలు,పబ్లిక్ పార్క్ లో 30 ఎకరాల్లో సైక్లింగ్,వాకింగ్,మ్యూజికల్ ఫౌంటెయిన్….నర్సరీ లో గ్లాస్ డోం ఉండేలా థీమ్ పార్క్ లు,డిస్ ప్లే అండ్ షాపింగ్,కిడ్స్ ప్లే ఏరియా,20 ఎకరాల్లో
ఫ్లవర్ పార్క్ లో దశావతార ఫ్లవర్ గార్డెన్ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాం…ఈ పనులన్నీ జనవరినెలాఖరు నుంచి ప్రారంభిస్తామని మంత్రి నారాయణ చెప్పారు.
రైతుల ప్లాట్ల రిజిస్ట్రేషన్లు వేగవంతం
రాజధానికి భూములిచ్చి ప్లాట్లు పొందిన రైతులను వెంటనే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని ఫోన్ ల ద్వారా సమాచారం ఇస్తున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు…మొత్తం 29,233 మంది రైతులకు 69,421 ప్లాట్లు కేటాయించగా ఇంకా కేవలం 2168 మంది రైతులకు మాత్రమే 7743 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందన్నారు..అలాగే లంక అసైన్డ్ ప్లాట్లకు సంబంధించి ఇంకా 157 మంది రైతులకు 295 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందన్నారు…కొంతమంది రైతులు రిజిస్ట్రేషన్ కోసం మరింత సమయం కావాలని కోరుతున్నారు..అలాగే ఇంకా రైతులకు 719 ఎకరాల మేర ప్లాట్లు కేటాయించాల్సి ఉందని మంత్రి స్పష్టం చేసారు…రాజధాని గ్రామాల్లో మౌళిక వసతుల కల్పన కోసం 900 కోట్లతో పనులు చేపడుతున్నారు…ఆయా పనులకు సంబంధించి సర్వే జరుగుతుందన్నారు…ఇక రైతులకు కేటాయించిన ప్లాట్లలో సరిహద్దు రాళ్లు కూడా త్వరలోనే వేసేలా ఆదేశాలు ఇచ్చామన్నారు.
ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు,స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం మరింత భూమి అవసరం
రాజధానిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ లో 16666 ఎకరాల మేర సమీకరణకు ఇప్పటికే ప్రభుత్వం జీవో జారీ చేసిందని మంత్రి నారాయణ చెప్పారు…అయితే ఈ భూమి రైల్వే ట్రాక్,రైల్వే స్టేషన్,ఇన్నర్ రింగ్ రోడ్డు,స్పోర్ట్స్ సిటీ కోసం సమీకరిస్తున్నట్లు మంత్రి చెప్పారు…అయితే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు,స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం మరికొంత భూమి అవసరం అవుతుందన్నారు మంత్రి నారాయణ.దీనికి సంబంధించి అధికారులు కసరత్తు జరుగుతుందని మంత్రి చెప్పారు.గతంలో మాదిరిగా ల్యాండ్ పూలింగ్ పై రైతులకు ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించేలా సీఆర్డీఏ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు.
అమరావతి
…..నారాయణ,మంత్రి….
రాజధాని అమరావతి లో 30శాతం గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం
133.3కి.మీల పరిధిలో ప్లాంటేషన్ ప్రణాళిక రూపొందించాం
ఇందుకనుగుణంగా వివిధ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధి చేపడుతున్నాం
శాఖమూరు, కృష్ణాయపాలెం, నీరుకొండల్లో గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్ కు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం
వచ్చే జనవరి నెలాఖరుకల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తాం
సీజన్ లో వచ్చే ఫ్లవర్స్ ప్రకారం బ్యూటిఫికేషన్ ఉంటుంది.
22 రోడ్లలో రెండు వైపులా బఫర్ జోన్ లో గ్రీనరి అభివృద్ధి జరుగుతోంది.
రైతు ల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయి
ఇంకా 2168 మంది రైతులకు 7743 ప్లాట్ లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది
రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని రైతులకు ఫోన్ చేసి సమాచారం ఇస్తున్నాం
భూములుచ్చిన రైతులకు ఇంకా 719 ఎకరాల మేర ప్లాట్ లు కేటాయించాల్సి ఉంది
29గ్రామాల పరిధిలో భూసమీకరణకు సహకరించని రైతుల్ని ఇవాళ్టికీ విజ్ఞప్తి చేస్తున్నాం
రైతులు ముందుకు రాకుంటే భూసేకరణ కు వెళ్తాo
సీఆర్డీఏ కార్యాలయంలోనే రైతుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తాం










































