వ్యవసాయ సీనియర్ పాత్రికేయుడు దాసరి ఆళ్వారస్వామికి 19న ఘనంగా సత్కారం
వ్యవసాయం, రాజకీయం, సాహిత్యం లాంటి అంశాలపై రచనలు చేస్తూ పుస్తకాలు వెలువరిస్తున్న అనుభవ పాత్రికేయులు శ్రీ దాసరి ఆళ్వారస్వామి ఈ నెల 19న ‘‘ఏరువాక ఫౌండేషన్” వారి ‘ఉత్తమ వ్యవసాయ పాత్రికేయ’ అవార్డ్ అందుకోబోతున్నారు. శనివారం గుంటూరు జిల్లా, కుంచెనపల్లికి సమీపంలోని కె.ఎల్. విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఈ బహుమతి ప్రదానోత్సవం జరగబోతోంది. 80 ఏళ్ల వయసులో కూడా ఆయన అలుపెరగకుండా వివిధ అంశాలపై రచనలు చేయటం, వారికి ఏరువాక ఫౌండేషన్ వారు అవార్డ్ ప్రకటించటం అభినందించదగినన విషయం.
1943 నవంబర్ 14వ తేదీన ఆళ్వారస్వామి జన్మించారు. కృష్ణాజిల్లా, విజయవాడ తాలూకా, కుందేరు గ్రామం వీరి జన్మస్థలం. తల్లి అలివేలమ్మ, తండ్రి బాలకోటయ్య. ఊహ తెలిసినప్పటి నుంచి వ్యవసాయం పట్ల ఆయన మక్కువ పెంచుకున్నారు. పాత్రికేయ వృత్తిలో 1978లో ప్రవేశించినా ‘ఈనాడు’ దినపత్రిక యాజమాన్యం వ్యవసాయ అంశాలకే ఆళ్వారస్వామిని ఉపయోగించుకొనేవారు. కోయంబత్తూరు,పూణె వంటి చెరకు పరిశోధనాలయాలకు పంపి, అక్కడి పరిశోధనా ఫలితాలను తెప్పించి, తమ దినపత్రికలో ప్రచురిస్తుండేవారు. ఆ విధంగా వ్యవసాయ పాత్రికేయునిగా ముద్రవేసుకున్నారు. ఈనాడులో 10 ఏళ్ళు పనిచేసి అభిప్రాయభేదాలు వచ్చి రాజీనామా సమర్పించి బయటకు వచ్చేశారు. విలేఖరిగా రాజీనామా చేసినా, ఈనాడు దినపత్రికతో అనుబంధం వీడలేదు. వారి వ్యవసాయ శీర్షిక ‘రైతేరాజు’కు వివిధ వ్యవసాయ అంశాలపై వ్యాసాలు అందించేవారు. కరోనా సమయంలో ఆ శీర్షిక ఆపేవరకు, ఈనాడు అనుబంధ వ్యవసాయ మాసపత్రిక ‘అన్నదాత’ను మూసేవరకూ రచనలు అందింస్తూనే ఉన్నారు.
1979 ఆంధ్రభూమి దినపత్రికలో విలేఖరిగా చేరారు. అక్కడ కూడా అభిప్రాయభేదాలు రాగా, రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆంధ్రభూమి యాజమాన్యం ప్రారంభించిన ‘రైతుభూమి’ శీర్షికకు మూడున్నర సంవత్సరాలు నిత్యం వ్యాసాలు అందించగా, వేయికి పైగా వ్యాసాలు ఆ శీర్షికలో ముద్రించబడ్డాయి. ఆళ్వారస్వామి గురుతుల్యులు శ్రీ మోటూరి వెంకటేశ్వరరావు ఒత్తిడి మేరకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో విలేఖరిగా చేరినా ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. వారి వ్యవసాయ శీర్షిక ‘కృషి’కి దీర్ఘకాలం రచనలు అందించటం, వ్యవసాయ వార్తలకు ప్రాధాన్యత కల్పించాలని యాజమాన్యం అభిప్రాయపడి, ‘ఆన్‌లైన్ అగ్రికల్చర్ బ్యూరో’ ఏర్పాటు చేయటంతో ఆళ్వారస్వామి విజయవాడ వార్తా ప్రతినిధిగా కొనసాగారు. ఆయన పని చేసిన పత్రికలన్నింటికి వ్యవసాయ విభాగంలో రచనలు అందించి వ్యవసాయ రచయితగా గుర్తింపు పొందారు.
పత్రికారంగం నుంచి బయటకు వచ్చి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. ఆయన సాధించిన ఘనత అపూర్వం, అద్వితీయం అనవచ్చు. వివిధ అంశాలకు సంబంధించి వారు రాసిన వ్యాసాలు 30 దినపత్రికల్లో ముద్రితమయ్యాయి. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, విశాలాంధ్ర, ప్రజాశక్తి లాంటి పత్రికలన్నీ వారి రచనలు ముద్రించాయి. దినపత్రికలకే పరిమితం కాకుండా 50 మాసపత్రిల్లో వారి రచనలు ప్రచురితమయ్యాయి. మరో 16 వారపత్రికలు, 2 పక్షపత్రికల్లో కూడా వీరి రచనలు ప్రచురితమయ్యాయి. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా వివిధ పత్రికలకు వివిధ అంశాలపై రచనలు అందించటంతొనే సరిపెట్టుకోలేదు. పుస్తకాలు రాయటం కూడా ప్రారంభించారు.
2001లో ఆళ్వారస్వామి వ్యవసాయరంగ అంశంపై రాసిన ‘చెరకు సాగు’ పుస్తకం అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. చెరకుతోనే సరిపెట్టుకోకుండా వరి, ప్రత్తి, మిర్చి లాంటి పంటల పైనే కాక, శ్రీగంధం, వెనిల్లా, కోకో లాంటి ఆధునిక పైంటలపై కూడా రచనలు చేసి పుస్తకాలు వెలువరించారు. వ్యవసాయరంగానికి సంబంధించి ఆయన వెలువరించిన పుస్తకాలు 16, దీర్ఘకాలంగా పత్రికారంగంలో కొనసాగి, పాత్రికేయ వృత్తిలోని సాధకబాధకాలు క్రోడీకరిస్తూ 1993లో ‘కత్తిమీద సాము – పాత్రికేయ వృత్తి’ అనే పుస్తకం రాశారు. తెలుగు జర్నలిజంలో మొదటి పద్మశ్రీ పురస్కారం అందుకున్న శ్రీ తుర్లపాటి కుటుంబరావు, అప్పటి తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా కొనసాగుతున్న డా॥ సి. నారాయణరెడ్డిగార్లు ఆ పుస్తకాన్ని ప్రశంసిస్తూ ముందుమాట వ్రాశారు. ఆ తర్వాత వివిధరంగాలకు చెందిన వాటిపై మరో 15 పుస్తకాలు రాసి ముద్రించారు. ఆకాశవాణికి 8 నాటికలు, నాటకాలు రాశారు.
‘తెలుగు తేజోమూర్తులు’ పేరున 12 పుస్తకాలు వెలువరించారు. జనవరి నుంచి డిశెంబర్ వరకు ఆ నెలల పేర్లుతో పుస్తకాలు వచ్చాయి. ఆ పన్నెండు నెలలలో జన్మించిన మహనీయుల సంక్షిప్త జీవితచరిత్రలు వాటిలో పొందుపరచారు.
వారికి జరిగిన సన్మానాలు, సత్కారాలు లెక్కలేదు. డా॥ వైయస్. రాజశేఖరరెడ్డి, కె. రోశయ్య, నారా చంద్రబాబునాయుడు వంటి వారు ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్న సమయంలోనే వీరిని సన్మానించారు. మరెందరో రాజకీయనాయకులు, అధికార ప్రతినిధులు, సాహితీ ప్రముఖులు ఆళ్వారస్వామిని సత్కరించారు. ఆ కోవలోనే ఇప్పుడు ఏరువాక ఫౌండేషన్ వారు ఆళ్వారస్వామిని సత్కరిస్తున్నారు.
Senior agriculture journalist Dasari Alwaraswamy to be felicitated today 19th, Aug
Mr. Dasari Alvaraswamy, an experienced journalist who has been publishing books on topics like agriculture, politics and literature, is going to receive the ‘Best Agricultural Journalist’ award from ‘Aeruvaka Foundation’ on 19th of this month. On Saturday, K.L. near Kunchenapalli, Guntur district. The prize giving ceremony is going to be held in the university premises. Even at the age of 80 years, he continues to write on various topics and it is appreciable that the Aeruvaka Foundation has announced an award for him.
Alvaraswamy was born on 14th November 1943. Kunderu village, Vijayawada taluk, Krishna district is their birth place. Mother Alivelamma, father Balakotayya. He developed a passion for agriculture since his childhood. Although he entered the journalism profession in 1978, the management of ‘Enadu’ daily used Alwaraswamy for agricultural topics. They used to send to sugarcane research institutes like Coimbatore and Pune, bring the research results there and publish them in their daily newspaper. Thus he was branded as an agricultural journalist. Today, after working for 10 years, there were differences of opinion and he submitted his resignation and came out. Even though he resigned as a reporter, he did not leave the association with today’s daily. They used to deliver essays on various agricultural topics to their agricultural title ‘Raitheraja’. He continued to write until the title was stopped during the Corona period, and till the closure of today’s affiliated agricultural monthly ‘Annadata’.
1979 Joined Andhra Bhoomi daily as a reporter. When there were differences of opinion there too, he resigned. After that, for three and a half years regular articles were provided to the title ‘Raithubhoomi’ which was started by Andhra Bhumi management and more than thousand articles were printed in that title. Alvaraswami Gurutulyulu Sri Moturi Venkateswara Rao forced him to join Andhra Jyothi daily as a reporter but could not continue for long. Contributing to their agricultural title ‘Krishi’ for a long time, Alvaraswamy continued as Vijayawada’s news correspondent as the management decided to give priority to agricultural news and formed the ‘Online Agriculture Bureau’. He contributed articles in the agricultural section to all the magazines he worked for and was recognized as an agricultural writer.
He came out of the press and continues as a freelance journalist. His achievement can be said to be unprecedented and unique. Articles written by them on various topics were published in 30 daily newspapers. Newspapers like Eenadu, Sakshi, Andhra Jyoti, Andhra Prabha, Andhra Bhoomi, Vishalandhra and Praja Shakti all published their works. His works were published in 50 monthly newspapers, not limited to daily newspapers. His works were also published in 16 other weekly newspapers and 2 weekly newspapers. As a freelance journalist, it is not enough to provide articles on various topics for various magazines. He also started writing books.
In 2001, Alvaraswamy’s book ‘Cheraku Sagu’ written on the subject of agriculture was launched by the then Chief Minister of Andhra Pradesh, Nara Chandrababu Naidu. Not just limited to sugarcane, he also wrote and published books on crops like rice, cotton and pepper, but also on modern crops like srigandham, vanilla and cocoa. He has published 16 books related to the agriculture sector, continued in the field of journalism for a long time and wrote a book titled ‘Kattimeed Samu – Journalistic Career’ in 1993, compiling the pros and cons of the journalistic profession. Shri Turlapati Kudumbarao, who received the first Padma Shri Award in Telugu Journalism, Dr. C. Narayana Reddygarlu wrote a foreword praising the book. After that, he wrote and published 15 more books on various fields. Wrote 8 dramas and dramas for Akashavani.
He has published 12 books under the name of ‘Telugu Tejomurtulu’. From January to December there were books with the names of those months. They contain brief biographies of the Mahaneys born in those twelve months.
The honors and favors given to them are innumerable. Dr. Ys. Rajasekhara Reddy, K. Roshaiah and Nara Chandrababu Naidu were honored during their tenure as Chief Ministers. Many other politicians, officials and literary figures honored Alvaraswamy. It is in that category that now Eruvaka Foundation is honoring Alvaraswamy.