రెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం

సాయంత్రం నంద్యాలలో సీఎం వైయస్ జగన్ పబ్లిక్ మీటింగ్
నంద్యాల: `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర రెండో రోజు ప్రారంభమైంది. ఆళ్లగడ్డ నైట్ హాల్ట్ నుంచి ప్రారంభమైన వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బస్సు యాత్ర కొద్దిసేపటి క్రితమే నల్లగట్టు చేరుకుంది. కాసేపట్లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఎర్రగుంట్లకు చేరుకోనుంది. వైయస్ జగన్ చేపట్టిన బస్సు యాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జననేత జగనన్నతో మేమంతా సిద్ధం అంటూ నినదిస్తున్నారు. సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రకు పూలు చల్లి స్వాగతం పలుకుతున్నారు. పార్టీ శ్రేణులకు, అభిమాన ప్రజలకు సీఎం వైయస్ జగన్ అభివాదం చేసుకుంటూ ముందుకుసాగుతున్నారు. కాసేపట్లో ఎర్రగుంట్లలో మేధావులు, ప్రజలతో సీఎం వైయస్ జగన్ ముఖాముఖి నిర్వహించనున్నారు. ప్రజల నుంచి తన పాలనపై ఫీడ్‌బ్యాక్‌తో పాటు మరింత మెరుగుపర్చుకునేందుకు సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు.
అనంతరం గోవిందపల్లి మీదుగా ప్రయాణించి చాబోలు శివారులో భోజన విరామం తీసుకుంటారు. తర్వాత నూనేపల్లి మీదుగా నంద్యాల చేరుకుని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం వైయస్ జగన్ ప్రసంగిస్తారు. అనంతరం పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్నకొట్టాల, కె.మార్కాపురం క్రాస్, నాగలాపురంలో ప్రజలతో మమేకమవుతూ పెంచికలపాడులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.