6 నుండి 18 వరకు సారస్
*మస్కట్ తయారీ
*జనవరి 6 నుండి 18వ తేదీ వరకు
*విమెన్ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ వేదికలుగా ఉండాలి
గుంటూరు, డిసెంబరు 29 : సారస్ (SARAS – Sale of Articles of Rural Artisans Society –
సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ సొసైటీ) ప్రదర్శనను జనవరి 6వ తేదీ నుండి 18వ తేదీ వరకు గుంటూరులో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గుంటూరు పట్టణంలో నర్సరావుపేట రహదారిలో రెడ్డి కళాశాల ఎదురుగా ఉన్న స్థలంలో ప్రదర్శన శాలల ఏర్పాటు జరుగుతుందన్నారు. రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా జాతీయ స్థాయి సారస్ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ఆయా రాష్ట్రాల సంస్కృతులను ప్రతిబింబించే చేనేతలు, హస్తకళలు, ఇతర సామగ్రిని ప్రదర్శించడం, విక్రయించడం జరుగుతుందని తెలిపారు. మినీ భారత సాంస్కృతిక, కళా సమ్మేళనంను తలపిస్తుందని చెప్పారు. ఆరు వందల మందికి పైగా చేనేత, హస్త కళాకారులు, సాంస్కృతిక కళాకారులు వస్తున్నారని, 250కు పైగా ప్రదర్శన శాలలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. హ్యాండ్లూమ్స్, హ్యాండిక్రాఫ్ట్స్, చీరలు, షాల్స్, కార్పెట్లు, బెడ్ షీట్ లు, వెదురు, లోహ, గాజు ఉత్పత్తులు, సాంప్రదాయ, ఆర్గానిక్ ఆహార పదార్థాలు, ఆభరణాలు, గృహ అలంకరణ వస్తువులు, ఆహార పదార్థాలు వంటి ఉత్పత్తులు ప్రదర్శన, విక్రయం జరుగుతుందన్నారు. ఈ మినీ భారత సమ్మేళనంలో గుంటూరు సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక విశేషాలు తెలియజేసి జిల్లా విశిష్టతను చాటిచెప్పుటకు వేదికగా మలచాలని పిలుపునిచ్చారు.
పారిశుధ్య నిర్వహణను గుంటూరు నగర పాలక సంస్థ పర్యవేక్షించాలని అన్నారు. చిన్నారుల క్రీడా వినోదానికి అవసరగు అమ్యూజి మెంట్ పార్క్ ను ఏర్పాటు చేయాలని తెలిపారు. పార్కింగ్ ఏర్పాట్లను, రద్దీ రీత్యా తీసుకోవలసిన చర్యలు పోలీసు శాఖ తీసుకోవాలని సూచించారు. ఆహార పదార్థాల తయారీ ప్రక్రియ – ఫుడ్ కోర్టులు ఉంటాయని, ఆహార పదార్థాలు తయారీలో ఎటువంటి కలుషితం జరగరాదని, నాణ్యతలో ఎటువంటి లోపాలు ఉండరాదని, దీనిని జిల్లా పౌర సరఫరాల అధికారి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విమెన్ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ
దేశం నలుమూలల నుండి స్వయం సహాయక సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నందున వారి సురక్షిత, భద్రత మన బాధ్యత అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను గుంటూరు గౌరవం, అభిమానం వారు చూరగోనలని పిలుపునిచ్చారు.
స్వయం సహాయక సంఘాలు తయారు చేసే పర్యావరణ హిత సామాగ్రిని వినియోగిస్తూ ప్లాస్టిక్ నిషేధిత జోన్ గా, స్వచ్ఛతకు శ్రీకారం చుట్టే విధంగా తీర్చిదిద్దాలని అన్నారు.
ఈ సమావేశంలో గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, సెర్ప్ డిప్యూటీ సి.ఇ.ఓ ఎ.కళ్యాణ చక్రవర్తి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు, జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి.విజయ లక్ష్మి, లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్ రెడ్డి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం భాషా,
జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జయలక్ష్మి, పర్యాటక శాఖ అధికారి రమ్య తదితరులు పాల్గొన్నారు.











































