ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సుమారు రూ:24.49.511లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేసిన రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థసారథి
నిరుపేదల మెరుగైన వైద్యానికి చేయూత ముఖ్యమంత్రి సహాయనిది రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి
రాష్ట్ర ప్రజలకు సుమారు .5కోట్ల మందికి ఎన్. టి. ఆర్.వైద్యసేవలు అందిస్తున్న కూటమి ప్రభుత్వం
నూజివీడు,సెప్టెంబరు:13
పేదల మెరుగైన వైద్యం కోసరం ప్రభుత్వం వేల కోట్లు కేటాయించిందని,రాష్ట్రంలో 5కోట్ల ప్రజలకు ఎన్. టి. ఆర్ వైద్యసేవ ద్వారా ఆరోగ్య సేవలు అందిస్తున్న కూటమి ప్రభుత్వం అని మంత్రి తెలిపారు.
అపత్కాలంలో ఉన్న నిరు పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి, అండగా నిలుస్తుందని రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడు నియోజకవర్గంలో చాట్రాయి మండలంలో 17మంది కుటుంబాలకు గాను సుమారు,రూ,6.99.041లక్షలు, ఆగిరిపల్లి మండలంలో 6గురి కుటుంబాలకు రూ,1.95.152లక్షల, ముసునూరు మండలంలో 7గురి కుటుంబాలకు రూ,3.15.132లక్షల, నూజివీడు మండలంలో 6గురి కుటుంబాలకు గాను,రూ,3.97.473లక్షల నూజివీడు పట్టణానికి చెందిన 8మంది కుటుంబాలకు గాను రూ.5.28.678లక్షల ఇతర ప్రాంతాలకు చెందిన 8మంది రూ.3.14035లక్షల మొత్తం 52మంది కుటుంబాలకు గాను సుమారు రూ.24.49.511లక్షల
.చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేసిన మంత్రివర్యులు. బాధిత
కుటుంభాలు తాము ఒక ప్రవేట్ హాస్పటల్లో చికిత్స చేయించుకుని ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నామని ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి బిల్లులు మంజూరు చేయమని
మంత్రి వర్యులను అడుగగా
మంత్రివర్యులు తక్షణమే స్పందించి కొన్ని రోజులకే చెక్కులు మంజూరు చేయించి బాధిత కుటుంబాలకు అందజేశారు. నియోజకవర్గానికి చెందిన పలువురు గతంలో వైద్యం చేయించుకొని ఉన్న బిల్లులను ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీ చేసుకోవచ్చని అన్నారు.
గతంలో వైద్యం చేయించుకున్న వారు వైద్యం చేయించుకున్న బిల్లులను మా కార్యాలయంలో అందజేస్తే ముఖ్యమంత్రి సహాయ నిధినుండి ఆర్ధిక సహాయం వెంటనే అందజేస్తానన్నారు.
మెరుగైన వైద్యానికి కూటమి ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తుందని ప్రజలంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య పరికరాలు,నిఫుణులైన సిబ్బంది, అందుబాటులో ఉన్నారని ప్రజలంతా మెరుగైన వైద్యాన్ని సద్వినియోగం చెసుకోవలన్నారు.
రాష్ట్ర మంత్రి పార్థసారథికి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆపదలో ఉన్న మా కుటుంబాన్ని దేవుడి లా ఆదుకొన్నారని ఇలాంటి మంత్రి కి జీవితాంతం రుణపడి ఉంటామని, తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు, కుటుంబ సభ్యులు తమ హర్షాన్ని కృతజ్ఞతను తెలియజేసారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.