వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
21-02-2024
రాష్ట్రవ్యాప్తంగా 53,35,519 మంది 0-5 మధ్య వయసు పిల్లలకు పోలియో చుక్కలు
అమరావతి, రాష్ట్రవ్యాప్తంగా 53,35,519 మంది 0-5 మధ్య వయసు గల పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు.ఎం. టి.కృష్ణబాబు అధ్యక్షత పల్స్‌పోలియో-2024పై స్టేట్ టాస్క్‌ఫోర్స్ సమావేశం వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం 5వ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జరిగింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్, చైల్డ్ హెల్త్, ఇమ్యునైజేషన్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అర్జునరావు, పీవో డాక్టర్ ఎల్‌బిహెచ్ఎస్ దేవి పాల్గొన్నారు.
నేషనల్ ఇమ్యునైజేషన్ డే మార్చి 3న నిర్వహించేందుకు సర్వసన్నద్ధమయ్యేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. పల్స్‌పోలియో కార్యక్రమంలో ఇతర శాఖల్ని భాగస్వామ్యం చేసేందుకు ఉద్దేశించిన స్టేట్ టాస్క్‌ఫోర్స్ సమావేశానికి మహిళా శిశు సంక్షేమం, మునిసిపల్ , పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామ,వార్డు సచివాలయాలు తదితర శాఖల అధికారులు వర్చువల్గా పాల్గొన్నారు. పన్నేండేళ్ల క్రితమే మన దేశం పోలియో రహిత దేశంగా మారినప్పటికీ, పొరుగుదేశాల్లో ఇంకా పోలియో కేసులు రిపోర్టు అవుతున్నాయి. పోలియోపై సుస్థిర విజయాన్ని సాధించేందుకు నేషనల్ ఇమ్యునైజేషన్ డేని జరుపుకుంటున్నాం. పిల్లల్ని పల్స్ పోలియో కేంద్రాలకు తీసుకువచ్చేందుకు ఆయా శాఖల అధికారులు వైద్య ఆరోగ్య శాఖకు సహకరించాలని ఈ సందర్భంగా ఎం.టి.కృష్ణబాబు కోరారు. ఆయా శాఖల సమన్వయంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అంగన్వాడీ వర్కర్లు, గ్రామ వార్డు సచివాలయాల వాలంటీర్లతో ఎఎన్ఎంలు సమన్వయం చేసుకోవాలన్నారు. పల్స్ పోలియోపై అవగాహన కలిగించేందుకు పెద్ద ఎత్తున పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయడంతో పాటు పబ్లిక్ అనౌన్ష్‌మెంట్ చేయడం, ప్రసార సాధనాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం వంటి కార్యక్రమాల్ని నిర్వహించాలన్నారు. మార్చి 3న పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన పిల్లల వివరాల్ని తీసుకుని మార్చి 4న ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వెయ్యాలని కృష్ణబాబు సూచించారు,