మొంథా తుఫాను సమయంలోనూ, అనంతర పరిస్థితుల్లోను గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది
* ఫిరంగిపురం మండలం పొనుగుపాడు వద్ద రహదారిపై నీరు ప్రవాహం ఉండటంతో బేతపూడి వాగు వద్ద, చప్ట వద్ద వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
* గుంటూరు గ్రామీణ మండలం గోర్లవారిపాలెం వద్ద కొండవీటి వాగు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అధికారులు తగు చర్యలు తీసుకున్నారు.
* తాడికొండ మరియు అడ్డా రోడ్ వద్ద కాలువల్లో నీరు రహదారి పైకి రావడంతో అధికారులు ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు.
* పెదనందిపాడు మండలం అభినేని గుంట పాలెం వద్ద వర్షం నీరు రోడ్డుపై ప్రవహించడంతో ప్రమాదాలు జరగకుండా బార్కెట్లు ఏర్పాటు చేశారు.
*మేడికొండూరు మండలం వై.వి.ఆర్.ఎస్.సి కాలనీ వద్ద చప్ట పై వాగు నీరు ప్రవాహంతో రాకపోకలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
* తెనాలి – మంగళగిరి రహదారిలో సోమసుందర పాలెం వద్ద చెట్టు కూలిపోగా తక్షణం తొలగించారు.
*ఆలూరు వద్ద పడిపోయిన చెట్లను తొలగించారు.
* దుగ్గిరాల మండలం కరకట్ట – వీరలపాలెం , పెద్ద కిండూరు, పెరుకలపూడి గ్రామాల వద్ద రాత్రి కూలిన చెట్లను తక్షణం తొలగించారు.
* దొప్పలపూడి వద్ద కూలిన చెట్టును వెంటనే తొలగించారు.
* విద్యుత్ అంతరాయంతో నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా జనరేటర్లు ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేస్తున్నారు.
* పలు చోట్ల విద్యుత్ సబ్ స్టేషన్ లకు అంతరాయం కలుగగా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.




















































