సచివాలయంలో ఉద్యానవనం పునరుద్ధరణ
ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతల స్వీకారం నేపథ్యంలో రాష్ట్ర సచివాలయ ఆవరణలోని ఉద్యానవనాన్ని అన్ని హంగులతో సీఆర్‌డీఏ అధికారులు పునరుద్ధరించారు.

విజయవాడ, జూన్ 13 : ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతల స్వీకారం నేపథ్యంలో రాష్ట్ర సచివాలయ ఆవరణలోని ఉద్యానవనాన్ని అన్ని హంగులతో సీఆర్‌డీఏ అధికారులు పునరుద్ధరించారు. సచివాలయ నిర్వహణ అంతా సీఆర్‌డీఏనే చూస్తుంది. అయితే గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సచివాలయంలోని ఉద్యానవనం నిరాదరణకు గురై కళ తప్పింది. తాజాగా ఇక్కడి ఫౌంటెయిన్ పునరుద్ధరణతో సచివాలయానికి కళ వచ్చింది. ఉద్యానవనాన్ని మొత్తం పునరుద్ధరించారు. నీడనిచ్చే చెట్లు, పూలమొక్కలు, లాన్‌ను సరికొత్తగా ముస్తాబు చేశారు.

















































