అమరావతి:
వి.ఐ.టి.-ఏ.పి విశ్వవిద్యాలయకు ప్రతిష్టాత్మకమైన ISO 21001: 2018, ISO 50001: 2018 , ISO 14001:2015 సర్టిఫికెట్లు
విఐటి -ఏపి విశ్వవిద్యాలయం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ISO) నుండి ప్రతిష్టాత్మక ISO 21001: 2018 (ఎడ్యుకేషనల్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్), ISO 50001: 2018 (ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిస్టమ్), మరియు ISO 14001:2015 పర్యావరణ నిర్వహణ వ్యవస్థ) సర్టిఫికెట్లు సాధించినట్లు తెలియచేసిన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా|| ఎస్. వి. కోటా రెడ్డి.
విఐటి -ఏపి విశ్వవిద్యాలయం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు డాక్టోరల్ ప్రోగ్రామ్‌లలో అత్యున్నత విద్యా ప్రమాణాలను అవలంబించటం వలన ఈ సర్టిఫికేషన్స్ సాధించినట్లు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా|| ఎస్. వి. కోటా రెడ్డి తెలియచేసారు. ఈ సర్టిఫికేషన్స్ లను HYM ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ వారు, వైస్ ఛాన్సలర్ డా|| ఎస్. వి. కోటా రెడ్డి మరియు రిజిస్ట్రార్ డా|| జగదీష్ చంద్ర లకు అందచేశారు.
ఈ ఐఎస్ఓ సర్టిఫికెట్స్ అత్యుత్తమ విద్యా నాణ్యత, సమర్థ నిర్వహణ మరియు పర్యావరణ సుస్థిరతలలో విశ్వవిద్యాలయ అంకితభావానికి ప్రమాణంగా నిలుస్తున్నాయి ISO 21001: 2018 సర్టిఫికేషన్ ప్రధానంగా విద్యా విభాగాలలో ర్యాంకింగ్‌లు, గుర్తింపు మరియు విద్యా నాణ్యతకు కొలమానంగా నిలుస్తుంది.
విఐటి -ఏపి విశ్వవిద్యాలయం గ్రీన్ క్యాంపస్ వాతావరణాన్ని కలిగిఉండటం, గ్రీన్ జోన్ల అమలు, రెయిన్ హార్వెస్టింగ్ కార్యక్రమాలు మరియు సమర్థవంతమైన కాలుష్య నియంత్రణ చర్యలవల్ల సర్టిఫికెట్ అఫ్ ఎక్సలెన్స్ తో సాధించగలిగింది.
విఐటి -ఏపి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా|| ఎస్. వి. కోటా రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయం యొక్క యాజమాన్యం, అధ్యాపకులు మరియు సిబ్బంది యొక్క అంకితభావంతో మరియు కృషి ఫలితంగానే ఈ ఘనతను సాధించామని తెలియచేసారు. అత్యున్నత విద్యా ప్రమాణాలు మరియు ఉత్తమ విద్యా విధానాలు, నాణ్యమైన విద్యను అందించడంలో విఐటి – ఏపి విశ్వవిద్యాలయం ఎల్లప్పుడూ ముందుంటుందని . ఈ ISO సర్టిఫికేషన్‌ల వల్ల అకడమిక్ ఎక్సలెన్స్ మరియు అత్యున్నత విద్యా ప్రమాణాలతో అగ్రగామిగా విశ్వవిద్యాలయం స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలియచేసారు.