PREPARATIONS ARE AT HIGH SPEED FOR THE SWEARING IN CEREMONY OF CM ELECT NARA CHANDRABABU NAIDU
CBN-చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూశారా…
ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణాస్వీకారం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి…
ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రమాణాస్వీకారం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గన్నవరం మండలం కేసరపల్లి మేధా టవర్స్ ప్రక్కన జరిగే పనులను టీడీపీ నేతలు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జర్మన్ హ్యాంగర్స్‌తో భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో స్జేజీని సిద్ధం చేస్తున్నారు. స్టేజీ పనులను తిరుపతి జేసీ ధ్యాన్‌చందర్, వైజాగ్ వీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ పర్యవేక్షిస్తున్నారు. 800 అడుగుల పొడవు, 420 వెడల్పు గల జర్మన్ హ్యాంగర్స్‌తో భారీ టెంట్‌ను వేస్తున్నారు.
ఆదివారం టీడీపీ నేత అచ్చెన్నాయుడు, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్‌కుమార్ గుప్త, ప్రత్యేకాధికారులు ప్రద్యుమ్న, బాబు.ఎ, వీర పాండ్యన్, వ్యవసాయ శాఖ కమీషనర్ హరికిరణ్, రాష్ట్ర అదనపు డీజీపీ బాబ్జీ, ఐజీలు రాజశేఖర్‌బాబు, అశోక్ కుమార్, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, సీపీ రామకృష్ణ, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు.