NRI-ఏపీ అభివృద్ధికి నార్వే ఏపీ డెవలప్‌మెంట్ ఫోరమ్ మద్దతు
ఆంధ్రప్రదేశ్(andhra pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే(NDA) కూటమి అద్భుత విజయం సాధించినందుకు ఏపీ డెవలప్‌మెంట్ ఫోరమ్(AP Development Forum) నార్వే(Norway)లో సంబరాలు నిర్వహించింది. ఈ క్రమంలో అక్కడ పలువురు నేతలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ(TDP), బీజేపీ(BJP), జనసేన(janasena) పార్టీలు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయగా.. ఫలితాల్లో రాష్ట్రంలోని 174 అసెంబ్లీ స్థానాలకు గానూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ 135 స్థానాల్లో విజయం సాధించింది. అదే సమయంలో జనసేన పార్టీ 21 స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో గెలిచింది. మరోవైపు జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని అధికార వైసీపీకి 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఐదేళ్ల తర్వాత మళ్లీ చంద్రబాబు నాయుడు మరోసారి రాష్ట్రంలో సీఎంగా జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.