01.08.2023
అమరావతి
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసిన నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి. రాధ, నీతి ఆయోగ్ ప్రతినిధుల బృందం పార్ధసారధి రెడ్డి, నేహా శ్రీవాత్సవ, అభిషేక్.
ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలు
ఏపీలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమం గురించి నీతి ఆయోగ్ ప్రతినిధులతో చర్చించిన సీఎం, నగరీకరణ, పారిశ్రామికీకరణ అంశాల్లో దేశంలో ఎంపిక చేసిన 4 నగరాల్లో విశాఖకు చోటు కల్పించడం శుభపరిణామమని సీఎం అన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఎయిర్పోర్ట్ – సీపోర్ట్ కనెక్టివిటీ రోడ్, డేటా సెంటర్, మూలపేట పోర్టు, ఇనార్బిట్ మాల్ ఇలా అనేక విధాలుగా విశాఖపట్నాన్ని అభివృద్ది చేసి అంతర్జాతీయంగా, ప్రపంచ పటంలో పెట్టే ప్రయత్నాన్ని తమ ప్రభుత్వం చేస్తుందన్నారు. అంతేకాక ఏపీలో నూతనంగా నిర్మిస్తున్న సీపోర్టులు, వ్యవసాయం, వైద్య ఆరోగ్యరంగం, విద్యారంగం, నాడు నేడు, నవరత్నాలు, ఆర్బీకేలు, గ్రామ, వార్డు సచివాలయాలు ఇలా ప్రతి విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వాటి ఫలితాలపై ఈ సమావేశంలో చర్చించారు.
ఏపీలో జరుగుతున్న అభివృద్ది, ప్రభుత్వ పనితీరును అభినందించిన నీతి ఆయోగ్ బృందం. ఇదంతా కూడా సమగ్ర నివేదిక రూపంలో తమకు అందజేయాలని సీఎంను కోరిన నీతిఆయోగ్ టీమ్. ఏపీకి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామని వెల్లడి.
సమావేశంలో పాల్గొన్న ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి గిరిజా శంకర్.