21.04.2023
అమరావతి
డాక్టర్ వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి జాతీయ స్ధాయిలో గుర్తింపు
అవార్డు గెలుచుకోవడంపై వ్యవసాయ శాఖ అధికారులను అభినందించిన సీఎం శ్రీ వైఎస్ జగన్
ఇటీవల రాయ్‌పూర్‌లో జరిగిన పీఎంఎఫ్‌బీవై జాతీయ సదస్సులో ఇన్నోవేషన్ కేటగిరీలో ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్‌కు అందజేసిన కేంద్ర వ్యవసాయ కార్యదర్శి మనోజ్ అహుజా
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసి, భారత ప్రభుత్వం అందజేసిన జ్ఞాపికను చూపిన వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ స్పెషల్ కమిషనర్ సి.హరికిరణ్
అధికారులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత సమర్ధవంతంగా పనిచేయాలని, దిగుబడుల అంచనాలలో టెక్నాలజీ వినియోగం పెంచాలని దిశానిర్ధేశం చేసిన సీఎం శ్రీ వైఎస్ జగన్
సాగుచేసిన ప్రతి ఎకరా పంట వివరాలను అత్యంత పారదర్శకంగా ఈ–క్రాప్ ద్వారా నమోదు చేయడం, తద్వారా ఉచిత పంటల బీమా పథకాన్ని కేవలం ఈ–క్రాప్ నమోదు ఆధారంగా అమలుచేయడం ద్వారా యూనివర్శల్ కవరేజిని సాధించిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు.
21.04.2023
Amaravati
National level recognition of Dr. YSR’s free crop insurance scheme
CM Shri YS Jagan congratulated the Agriculture Department officials on winning the award
Union Agriculture Secretary Manoj Ahuja presented a special certificate of appreciation in the innovation category to Harikiran, Special Commissioner, Department of Agriculture at the PMFBY National Conference held in Raipur recently.
Chief Secretary Gopalakrishna Dwivedi and Special Commissioner of the Department C. Harikiran who met the Chief Minister Shri YS Jagan at the CM Camp office and showed the memento presented by the Government of India.
Appreciating the officers, CM Shri YS Jagan directed them to work more efficiently in the future and increase the use of technology in yield estimations.
Andhra Pradesh holds the record of being the only state to achieve universal coverage by registering details of every acre of cultivated crop through e-Crop in a highly transparent manner, thereby implementing a free crop insurance scheme based on e-Crop registration alone.