ఏలూరు బస్సు ప్రమాదంపై మంత్రి పార్థసారథి ఆరా…
ఏలూరుజిల్లా, లింగపాలెం సమీపంలోని జూబ్లీ నగర్ వద్ద ప్రైవేటు బస్సు బోల్తాపడి ఓ సాఫ్ట్ వేరే ఉద్యోగి మృతిచెందిన ఘటనపై రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార మరియు పౌరసంబంధాలశాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథిగారు ఆరా తీశారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలను మంత్రి తెలుసుకున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సాప్ట్ వేర్ ఉద్యోగి వీరంకి ప్రవీణ్ బాబు కుటుంబానికి ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఘటనకు కారణమైన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారిపై అవసరమైన అత్యవసర చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఘటనలో గాయపడిన వారికి అవసరమైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు మంత్రి సూచించారు
                                
			













































