గుంటూరు జిల్లా…
అమరావతి రాజధాని కోసం రెండో విడత ల్యాండ్ పూలింగ్ కార్యాచరణపై సమావేశం.
కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, భాష్యం ప్రవీణ్, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లు.
…..నారాయణ,మంత్రి కామెంట్స్…….
అమరావతి రాజధాని నిర్మాణం కోసం రెండో విడత ల్యాండ్ పూలింగ్ పై అధికారులతో సమావేశం నిర్వహించాము.
మొదటి విడత ల్యాండ్ పూలింగ్ లో ఎంతో మంది రైతులు భూములు ఇచ్చారు.
ఇప్పటికే అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
రైతులు ఇచ్చిన భూములకు ఇంకా విలువ పెరగాలి అంటే ఇక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ జరగాలి.
అలా జరగాలి అంటే ఇంకా ప్రపంచస్థాయి సంస్థలు నెలకొల్పాలి.
అంతర్జాతీయ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కావాలి.
ముఖ్యమంత్రి చంద్రబాబు దూరద్రుష్టితో రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేయాలని సూచించారు.
ఈ ల్యాండ్ పూలింగ్ కు సంబంధించి అధికారుల నియామకం, కార్యాలయాల ఏర్పాటుపై చర్చించాము.
రెండో విడత కూడా ల్యాండ్ పూలింగ్ పారదర్శకంగా గా చేయాలని అధికారులకు సూచించాము.
ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాం.
ఆ కమిటీలో కూడా కూడా మంచి అధికారులు నియమించాలని సూచించాము.










































