హైదరాబాద్
శ్రీమతి నిర్మల కు మాతృమూర్తి పురస్కారం ప్రదానం – దేవ సేన
మాతృ రుణం తీర్చుకోలేనిది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బంగారయ్య శర్మ అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం లోని ఎన్.టీ.అర్. కళా మందిరం లో సిద్ధేంద్ర ఆర్ట్స్ అకాడమీ నిర్వహణలో మాతృ దేవో భవ పేరిట నృత్య సంగీత కార్యక్రమం జరిగింది. నాట్య గురువు రేణుక శిష్యురాలు స్వాతిక ల కూచిపూడి నృత్యం, బాలకామేశ్వర రావు గానం గురుస్వామి పేరడీ పాటలు తో మాతృ వందనం జరిగింది అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిధి గా పాల్గొన్న బంగారయ్య శర్మ తల్లి విశిష్టతను వివరిస్తూ శక్తి స్వరూపిణి ఇన అమ్మవారు కూడా అందరికీ మాతృ మూర్తి అని అభివర్ణించారు.
ఈ సందర్భంగా మాతృమూర్తి పురస్కారాన్ని ఇ..నిర్మల కు (స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ డైరెక్టర్) ప్రదానం చేసి సత్కరించారు.
సంస్థ అధ్య్షురాలు దేవ సేన మాట్లాడుతూ తమ మాతృ మూర్తి పేరిట గత 27 సంత్సరాలుగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.వేదిక పై నిర్మాత రామ సత్యనారాయణ,కేంద్ర ఆదాయ పన్నుల శాఖ అధికారి రఘు కిరణ్, ఎదా శామ్యూల్ రెడ్డి , ఆనంద్ రెడ్డి పాల్గొన్నారు