వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముందుకు సాగుదాం
జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 2,30,000 మందికి, సుమారు 436 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది
అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోనేలా అవగాహన పెంచండి
ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు ఛైర్మన్
లంకా దినకర్
* చిత్తూరు పట్టణానికి త్రాగునీటి సమస్యల పరిష్కారానికి అడవిపల్లె రిజర్వాయర్ నుంచి పైపులైన్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయి
పల్లె పండగ ద్వారా జిల్లాలో పలు అభివృద్ధి పనులు జరిగేయిని బకాయిల కొరకు ప్రభుత్వానికి నివేదికలు అందజేయడం జరిగింది
సీజన్ వ్యాధుల పట్ల ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివిధ సంక్షేమ పథకాల అమలపై అర్హులైన నిరుపేదలకు అందజేయాలని సంబంధిత అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం జరిగింది
:జిల్లా కలెక్టర్
*చిత్తూరు, డిసెంబర్ 10 * భారత ప్రధాని నరేంద్రమోడీ గారి సంకల్పం వికసిత్ భారత్-2047, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముందుకు సాగుదామని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు ఛైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు.
బుధవారం జిల్లా సచివాలయం లోని సమావేశపు మందిరము నందు ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు ఛైర్మన్ లంకా దినకర్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు నగర మేయర్ అముద, లతో
కలిసి వైద్య ఆరోగ్యం మరియు విద్యాకు సంబందించిన పథకాలు, అమృత్ 1.0, అమృత్ 2.0, జల్ జీవన్ మిషన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్లపై ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ మాట్లాడుతూ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిద పథకాలపై ఇదివరకే వివిధ జిల్లాలో సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగిందని,చిత్తూరు జిల్లా రావడం ఇది రెండో సారి అని ఈ పథకాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించడం మన లక్ష్యమన్నారు.గౌ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పంతో మన దేశ అభివృద్దిని ముందుకు నడుపుతున్నారని, మన రాష్ట్రంలో గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలో అగ్రగామి రాష్ట్రంగా, అన్నీ రంగాల్లో ముందుండే విదంగా తయారు చేసేందుకు విజన్-2047 కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. విద్యా – వైద్య స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో చిత్తూరు జిల్లా అగ్రగామిగా నిలవాలి స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ సంకల్పానికి అనుగుణంగా విద్యా – వైద్య రంగంలో చిత్తూరు జిల్లా మంచి ఫలితాలు సాధించాలనిజాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల అమలు గురించి ప్రత్యేక దృష్టి పెట్టాలిఆయుష్మాన్ భారత్ – డా. ఎన్టీఆర్ వైద్య సేవతో ఆరోగ్య చిత్తూరు జిల్లా ముందు వరుసలో ఉండే విధంగా అధికారులు పనిచేయాలని పేర్కొన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ* గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో విజన్ -2047, స్వర్ణకుప్పం-2029 కార్యక్రమాల్ని ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లాలో ఉపాది హామీ పథకం కింద 150 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, సి సి రోడ్లు అనిమల్ షెడ్లు తదితర పనులు మంజూరు చేసి 80 శాతం పనులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. పల్లె పండుగ కార్యక్రమంలలో భాగంగా పల అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందని పనులు పూర్తయిన సందర్భంగా బిల్లులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి బకాయిల కొరకు ప్రభుత్వానికి నివేదికల అందజేయడం జరిగిందని తెలిపారు, చిత్తూరు జిల్లా పట్టణానికి దాహార్తి తీర్చడానికి అడవిపల్లె రిజర్వాయర్ నుంచి త్రాగునీటి పైపులు నిర్మాణం పనులు జరుగుతున్నాయని తెలిపారు, వివిధ సంక్షేమ పథకాలు అరులైన వారికి అందజేయడానికి సంబంధిత అధికారులకు దిశా దశ నిర్దేశాలు జారీ చేయడం జరిగిందని వివరించారు. సీజన్ వ్యాధుల పట్ల విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు.
దీనితో పాటూ ఒ హెచ్ ఆర్ ట్యాంకుల మరమ్మత్తులకు యుద్ధ ప్రాతిపదిన పనులు
చేపడుతున్నామని వివరించారు. అనంతరం చైర్మన్ పత్రిక సమావేశంలో మాట్లాడుతూ ఈరోజు సంబంధిత అధికారులతో కలిసి వైద్య ఆరోగ్యం మరియు విద్యాకు సంబందించిన పథకాలు, అమృత్ 1.0, అమృత్ 2.0, జల్ జీవన్ మిషన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్లపై ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగిందిపీఎం మాతృవందన యోజన, జననీ సురక్షా యోజన (జేఎస్పీ), జననీ శిశు సంరక్ష కార్యక్రమం, రాష్ట్రీయ కిషోర్ స్వస్త కార్యక్రమం (ఆర్కెఎస్కె), రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ( ఆర్బీఎస్కె), ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, ఎన్టీఆర్ వైద్య సేవ, తల్లికి వందనం, డొక్కా సీతమ్మ భోజన పథకం, పీఎం శ్రీ తదితర పథకాలతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించే జల్ జీవన్ మిషన్, అమృత్ పథకాలకు సంబంధించిన అంశాలపై సమీక్షించి, పురోగతికి అవసరమైన కార్యాచరణపై సూచనలు చేయడం జరిగింది బహుళ ప్రయోజనాల పీఎం సూర్యఘర్ పథకం అమల్లోనూ మరింత చొరవ చూపాలన్నారు.
జిల్లాలో 19 నుండి 45 సంవత్సరాల వయస్సు వారికి 2025 – 26 సంవత్సరానికి అనీమియా పరీక్షలు లక్ష్యం 11,835 అయితే ఇప్పటివరకు అయిన పరీక్షలు 9,982 అందులో 3,353 అనీమియా కేసులు గుర్తించడం జరిగింది. ఇందులో 2,902 మందికి చాలా తక్కువగా, 450 మందికి ఒక మోస్తరుగా మరియు ఒక్కరికి తీవ్రంగా రక్తహీనత ఉంది, వీరందరికి ఈ సమస్య నుండి బయటపడడానికి ముఖ్యంగా 5 నుండి 19 సంవత్సరాల వారికి మరియు గర్భిణీ స్త్రీలకూ అవసరమైన వైద్యం అందించి మందులు అందిస్తూ అనీమియా ముక్త్ భారత్ కోసం అధికారులు కృషి చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించడం జరిగిందిప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ క్రింద ప్రతి 15 రోజులకు ఒకసారి ముందస్తు కాన్పులను తగ్గించడానికి స్కాన్లు మరియు రక్త పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి నెల 9 మరియు 10 వ తేదీ అన్ని ప్రభుత్వం ఆస్పత్రులలో గైనకాలజిస్ట్ ద్వారా గర్భీణీ స్త్రీలకు అన్ని పరీక్షలు మరియు సేవలు అందిస్తున్నట్లుఅధికారులుతెలిపారు.జిల్లాలో 100 శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని..
ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ ລ້ 4,999 ລ້໖ (2024 – 25 5 9,431 ລ້໖) శిశువులు ఆసుపత్రులలో జన్మించగా, ఇందులో 97% గర్భిణి స్త్రీలకు పోషక ఆహారం కోసం జననీ సురక్షా యోజన ( JSY ) ద్వారా 700 రూపాయిలు మరియు సుఖీభవ ద్వారా 300 రూపాయిలు కలిపి మొత్తం 1000 రూపాయిలు చెప్పున అక్టోబర్ 44.42 లక్షల రూపాయిలను ( 2024 25 లో 80.54 లక్షల రూపాయలు ) ఈ సంవత్సరంలో ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు లబ్దిదారులకు అందించడం జరిగింది. అదేవిధంగా జననీ శిశు సంరక్ష కార్యక్రమం ( JSSK ) ద్వారా ఉచిత పౌష్టికాహారం, మందులు, వైద్య పరీక్షలు వంటి సేవలు కోసం ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 15 లక్షల రూపాయిలను (2024 – 25 లో 28.29 లక్షల రూపాయలు) వినియోగించినట్లు అధికారులు తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ @ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంపై ప్రభుత్వం దృష్టిసారిస్తోందని.. ఈ క్రమంలో మాతా శిశు మరణాల రేటును తగ్గించడంపై అధికారులకు సూచనలు చేసినట్లు వెల్లడించారు.స్కూల్ ఐ స్కీనింగ్ కార్యక్రమం క్రింద జిల్లాలో పాఠశాలలో కంటి పరీక్షలను చేయగా, 3400 మందికి ( గత సంవత్సరం 3,500 మంది) కళ్ళ జోడులు అవసరం అవ్వగా అందరికి అందించడం జరిగింది.
మరో 524 మందికి ఈ సంవత్సరం ఇప్పటివరకు (గత సంవత్సరం 1,950 మంది ) కంటి ఆపరేషన్లు చేయించడం జరిగింది.సీజనల్ వ్యాధులకు సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టి ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పలు సంక్షేమ పథకాలపై సమీక్షించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఓ శ్రీనివాసులు, జిల్లా వైద్య శాఖ అధికారి సుధారాణి, డిప్యూటీ DMHO వెంకటేశ్వర ప్రసాద్, జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, డిఇఓ వరలక్ష్మి, సర్వ శిక్ష అభియాన్ అధికారి వెంకటరమణ, DwMa పిడి, రవికుమార్, విద్యుత్ అధికారి ఇస్మాయిల్, వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, హౌసింగ్ పిడి సుబ్రహ్మణ్యం,
అధికారులు తదితరులు పాల్గొన్నారు













































