అచ్చంగా ఇంగ్లీష్ వాళ్లలాగే …. చిన్న పిల్లలు కూడా…. అంతా అమ్మవల్లే
ఓ అమ్మ కోట్లాదిమంది తెలుగు వారికంటే కంటే భిన్నం గా ఆలోచించింది.
వారెవరూ చేయలేని పనిని చేసిన అమ్మ. ఆమె గురియించి తెలుసుకుంటే మనని మనం తెలుసుకున్నట్టే.
ఆభాషలో ఏమీ రాయలేవు ఎందుకంటే అది లిపి లేని భాష, బహు కొద్దిమందికి మాత్రమే పరిచయం ఉన్నభాష పాపులర్ కానే కాదు.
అయినా అది తన మాతృభాష అందుకే గుండెల్లో పెట్టుకుంది పదం పదం ప్రేమగా తన పిల్లల గుండెల్లో పొడిగింది. నాకళ్ళ ముందు
పుట్టి తప్పటడుగులు వేసిన అడుగులతో పాటు మాటలు కూడా నేర్చుకున్నారు.
ఇప్పుడు ఆ చిన్న పిల్లలు చక్కగా తమ మాతృభాషలో
తడుముకోకుండా మాట్లాడుతున్నారు. ఇంతకీ ఎవరామె ఆమె ఏంచేసింది అని అని తెలుసుకునేముందు మనం ఎవరిమి ? మనం మన
మాతృబాష తెలుగుని ని ఏంచేస్తాం ? తెలుగుభాష అతి ప్రాచీనమైన బాష, లిపి ఉన్న గొప్ప సాహిత్యం ఉన్న బాష, అందమైన ఉచ్చారణ
గల బాష, అంతర్జాతీయంగా మాట్లాడబడే బాష అయినా పనికిరాదని అవతల పారేస్తాం. ముసలిదైనా,ముతకదైనా తల్లి, తల్లే కదా !
ఆబుద్ధి తెలుగువాళ్ళకు ఎంతమందికి ఉంది? మన తలిదండ్రులలో 90 శాతం కి పైగా తమ పిల్లలని ఇంగ్లీష్ మీడియంలో వేసి చదివిస్తున్నారు.
పిల్లలకి తెలుగు నేర్పరు. తెలుగు రాదనీ గొప్పగా చెప్పుకుంటారు.ఏవన్నా అంటే ఉద్యోగాలు డబ్బులు అంటారు.కోట్లాదిమందికి ఆర్ధిక ప్రయాజనం
తప్ప వేరేదీ కనిపించదు. అందుకు భిన్నంగా ఉపయోగం పెద్దగాలేని, ఆర్ధిక ప్రయాజనం ఏమాత్రం లేని మాతృబాషకి ప్రాణం పెట్టిందీ అమ్మ
ఈ అమ్మ. ఆమె తన పిల్లలకు నేర్పించిన బాష ఉర్దూ హిందీ తెలుగు కలిసిన మిశ్రమ బాష. ఈ అమ్మ పేరు రిహానా జహంగీర్ బాషా.
మాతృబాషని ప్రేమించడంలో ఇంగ్లీష్ వాళ్లతోనే పోటీ పడగల అమ్మ అనేక మంది అమ్మలకి ఆదర్శం ఈ అమ్మ.