ప్రభుత్వం, పార్టీని టాప్ గేర్ లో పరిగెత్తించాలన్న జగనన్న
-అంకంరెడ్డి నారాయణమూర్తి
ప్రభుత్వాన్ని, పార్టీని ఇప్పుడు నడుపుతున్న స్పీడ్ కు తోడు, గేరు మార్చాల్సిన సమయం ఆసన్నమైందని, ఇకపై టాప్ గేర్ లో పరిగెత్తించేలా వేగాన్ని పెంచాలంటూ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు ఎన్నికల సమరానికి సన్నద్ధమయ్యేలా, ప్రజాక్షేత్రంలో పనిచేయాలని, సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో, సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారని, నవరత్నాలు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి తెలియజేశారు. వచ్చే ఆరు నెలల్లో ఎలా పనిచేయాలన్నది మనసులో పెట్టుకొని, పని చేయడం చాలా ముఖ్యమైన విషయం అన్నారు. ఇప్పటివరకు పనిచేయడం ఒక ఎత్తని, ఎన్నికలకు సన్నద్ధమయ్యే తీరు మరొక ఎత్తుగా ప్రణాళిక బద్ధంగా మనందరి సమిష్టి కార్యాచరణ ఉండాలని తెలియజేశారన్నారు. క్షేత్రస్థాయిలో మనకు పూర్తి అనుకూల పరిస్థితులు ఉన్నాయని, అందుకే ఒంటరిగా పోటీ చేయలేక విపక్షాలు, పొత్తుల రాగాలు అందుకుంటున్నాయని, ఈ పరిస్థితుల్లో 175 కు 175 స్థానాల్లో గెలుపు అసాధ్యమేమీ కాదని, సుసాధ్యమేనంటూ సీఎం తన సందేశంలో తెలిపారన్నారు.
గడపగడపకు కార్యక్రమం ద్వారా మన పట్ల ప్రజలు ఎంత సానుకూలంగా ఉన్నారో కళ్ళారా చూశామని, ఇప్పుడు అదే ఆత్మవిశ్వాసం, ధైర్యంతో ముందుకెళ్లాలని తెలిపారన్నారు. స్థానిక నేతలతో ఉన్న విభేదాలు వెంటనే పరిష్కరించుకొని, ప్రతి నియోజకవర్గంలోని నాయకుల్ని, కార్యకర్తలను సమన్వయ పరుచుకుంటూ, నిత్యం ప్రజలతో మమేకమవుతూ ముందుకెళ్లాలని జగనన్న ఉద్భోదించారన్నారు. సర్వేలు చివరి దశలో ఉన్నాయని, రానున్న రెండు నెలలు ప్రజాక్షేత్రంలో ఎంత ఎక్కువగా పని చేస్తూ ఉంటే, సర్వేలు అంత మంచి ఫలితాలు వస్తాయని, నియోజకవర్గ ప్రజల దృష్టిలో ఎవరికి టిక్కెట్ ఇస్తే, మంచి మెజారిటీతో గెలిచి వస్తారో ప్రాతిపదికనే టికెట్లు ఇస్తామని తెలిపారన్నారు.
మనదంతా ఒకే కుటుంబమనీ, టిక్కెట్ ఇస్తే ఒకలా, ఇవ్వకపోతే మరోలా ఎవరు ప్రవర్తించకూడదని, సాధ్యమైనంత మేరకు సిట్టింగుల్లో ఎక్కువమందికి టికెట్లు ఇస్తామని, టికెట్ ఇవ్వనంత మాత్రాన నా వాళ్లు కాకుండా పోరని, టికెట్లు ఇస్తే ఒక బాధ్యతని, టికెట్ వచ్చినా రాకున్నా మీరు ఎప్పటికీ నా వాళ్ళు గానే ఉంటారని భరోసా ఇచ్చారన్నారు. ఒకవేళ టికెట్ ఇవ్వలేని పక్షంలో, వారికి మరొకటి ఇస్తామని, లీడర్ మీద, పార్టీ మీద నమ్మకముంచాలని అన్నట్లు తెలిపారు . జుట్టు ఉంటేనే ముడి వేసుకోగలమంటూ, అధికారంలో ఉంటేనే ప్రజలకు మరింత మంచి చేయగలమని చెప్పారన్నారు. అందుకే మీరంతా టిక్కెట్ల విషయంలో నేను తీసుకునే నిర్ణయాలను, పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలన్నారని తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు 98 లక్షల సర్టిఫికెట్లు ఉచితంగా ఇవ్వడంతో వారందరికీ సహాయ సహకారాలు అందిస్తూ, మంచి చేయగలిగామని, అదే స్ఫూర్తితో “జగనన్న ఆరోగ్య సురక్ష”, “ఏపీకి జగన్ కావాలి” అనే కార్యక్రమాల ద్వారా ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరికీ వివరించడం ద్వారా మన విజయాన్ని మళ్లీ ఖాయం చేసుకోవాలన్నారని నారాయణమూర్తి తెలియజేశారు.
అంకంరెడ్డి నారాయణమూర్తి
నవరత్నాలు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్