అమరావతి:
విఐటీ – ఏపి విశ్వవిద్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
విఐటీ – ఏపి విశ్వవిద్యాలయంలో ది. 08. 03. 2025 నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అర్జున అవార్డు (షూటింగ్) గ్రహీత ఇషా సింగ్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా ముఖ్య అతిధి శ్రీమతి ఇషా సింగ్ మాట్లాడుతూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో విజయం సాధించాలంటే కస్టపడి పనిచేయాలని సూచించారు. విధ్యార్థులు తక్కువ మార్కులు వచ్చాయని బాధపడకుండా చిన్న చిన్న లక్ష్యాలను నిర్ధేశించుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలని కోరారు.
విఐటీ – ఏపి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా|| ఎస్.వి. కోటా రెడ్డి మాట్లాడుతూ మహిళలకు విఐటీ – ఏపి విశ్వవిద్యాలయ అడ్మిషన్లలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. 2017 సంవత్సరంలో విఐటీ – ఏపి విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో కేవలం 8 శాతం మహిళా విద్యార్థులతో ప్రారంభమైందని, ఇది ఇప్పుడు 33శాతంకి పెరిగిందని, త్వరలోనే ఇది 50 శాతానికి చేరుతుందని మేమ ఆశిస్తున్నామని అన్నారు.
విటోపియా 2025 వార్షిక క్రీడల మరియు సాంస్కృతిక ఉత్సవం రెండవ రోజు సాయంత్రం జరిగిన ప్రొ-షో లో షల్మాలి ఖోల్గాడే (ప్రముఖ నేపధ్య గాయని), కార్తీక్ (ప్రముఖ నేపధ్య గాయకుడు), డిజె యష్ ల సంగీత విభావరి అందరినీ ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో విఐటీ – ఏపి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా|| జగదీశ్ చంద్ర ముదిగంటి, డా|| కృష్ణ సామి (విటోపియా కన్వీనర్), డా|| ఖాదీర్ పాషా (స్టూడెంట్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్), విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రత్యేక ఆహ్వానితులు, అతిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
డ్రగ్స్ రహిత ఇండియా కొరకు విఐటీ – ఏపి విశ్వవిద్యాలయంలో మారథాన్ ప్రారంభించిన గుంటూరు ఎస్పి
విటోపియా 2025 వార్షిక క్రీడల మరియు సాంస్కృతిక ఉత్సవం రెండవరోజు పురస్కరించుకొని నిర్వహించిన మారథాన్కు ముఖ్య అతిదిగా ఎస్. సతీష్ కుమార్, ఐపిఎస్ (గుంటూరు జిల్లా సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్) హాజరయ్యారు. విఐటి వైస్ ప్రెసిడెంట్ డా|| జి.వి. సెల్వం తో కలసి డ్రగ్స్ రహిత ఇండియా కొరకు మారథాన్ ప్రారంభించారు. మత్తు పదార్దాలకు యువత బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, వారిని కాపాడటం కోసం డ్రగ్స్ పై అవగాహన కల్పించటానికి మరియు డ్రగ్స్ రహిత ఇండియా కోసం మారథాన్ ను నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిది ఎస్. సతీష్ కుమార్, ఐపిఎస్ (గుంటూరు జిల్లా సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్) విద్యార్థుల చేత డ్రగ్స్ నిర్మూలన కొరకు ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో విఐటీ – ఏపి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా|| జగదీశ్ చంద్ర ముదిగంటి, డా|| కృష్ణ సామి (విటోపియా కన్వీనర్), డా|| ఖాదీర్ పాషా (స్టూడెంట్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్), డా|| ఎన్. రామచంద్ర రావు (ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్), విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.