అధునాతన నానోమెటీరియల్స్ , అప్లికేషన్స్‌పై రెండవ అంతర్జాతీయ సదస్సు (ICANA-2024)
Intl conference on advanced nano materials applications jointly held in VIT-AP and Southern Denmark University
విఐటి-ఏపి విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ సైన్సెస్ మరియు సదరన్ డెన్మార్క్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఆధ్వర్యంలో అధునాతన నానోమెటీరియల్స్ మరియు అప్లికేషన్స్‌పై రెండవ అంతర్జాతీయ సదస్సు (ICANA-2024)
స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ సైన్సెస్, విఐటి -ఏపి విద్యాలయం మరియు యూనివర్శిటీ ఆఫ్ సదరన్ డెన్మార్క్ సంయుక్తంగా ఆధ్వర్యంలో ది. 10 – 12 జూలై 2024 వరకు అధునాతన నానోమెటీరియల్స్ మరియు అప్లికేషన్స్ పై రెండవ అంతర్జాతీయ సదస్సును (ICANA-2024) వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నారు . ఈ సదస్సును స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ సైన్సెస్, విఐటి -ఏపి విశ్వవిద్యాలయం మరియు ఇండియానా యూనివర్సిటీ-పర్డ్యూ యూనివర్సిటీ ఇండియానాపోలిస్ సంయుక్తంగా 2022లో ప్రారంభించాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి మాట్లాడుతూ భారతదేశం వికసిత్ భారత్‌గా మారాలంటే, మనం ఎక్కువ కాగితాలపై కాకుండా మరిన్ని ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని, బలమైన సహకారం ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని ఆయన వివరించారు. సంస్థలు మరియు సంస్థలోని ఇతర విభాగాలమధ్య సమన్వయంతో కూడిన సహకారం ఎంతో అవసరమని తెలియచేసారు.
విఐటి – ఏపి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా|| ఎస్.వి.కోటారెడ్డి మాట్లాడుతూ అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్‌లు మరియు విద్యార్థులకు వారి పరిశోధన కార్యకమాలకు విశ్వవిద్యాలయం ఎంతో సహకారాన్ని అందిస్తుందని తెలియచేసారు. విశ్వవిద్యాలయం నూతన ఆవిష్కరణలు మరియు పరిశోధనలను నిర్వహించడానికి సీడ్ గ్రాంట్‌లను అందిస్తుందని తెలియచేసారు. ప్రతి సంవత్సరం అధ్యాపకులు మరియు రీసెర్చ్ స్కాలర్‌లు రూపొందించే పరిశోధన ప్రచురణలు మరియు పేటెంట్‌లతో విఐటి – ఏపి విశ్వవిద్యాలయం పరిశోధన రంగంలో సాధిస్తున్న ప్రగతిని వివరించారు. విఐటి – ఏపి విశ్వవిద్యాలయం గత రెండు సంవత్సరాలుగా అవుట్ లుక్ మాగజీన్ ర్యాంకింగ్స్ లో భారతదేశంలో ఎమర్జింగ్ స్టేట్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల కేటగిరీలో మొదటి స్థానంలో నిలుస్తుందని తెలియచేసారు.
విఐటి – ఏపి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా|| జగదీష్ చంద్ర ముదిగంటి మాట్లాడుతూ విఐటి -ఏపి విశ్వవిద్యాలయం భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వవిద్యాలయాలలో ఒకటిగా గుర్తించబడిందని తెలియచేసారు. మొదటి ఐసిఏఎన్ఏ (ICANA) అంతర్జాతీయ సదస్సు 2022 సంవత్సరంలో నిర్వహించటం మరియు అది విజయవంతం కావడం గురించి కూడా ప్రస్తావించారు, ఈ సదస్సులో భారతదేశం మరియు ప్రపంచం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు పాల్గొని అకడమిక్ ఎక్స్ఛేంజ్ మరియు పరిశోధన సహకారాన్ని కొనసాగించడంలో సహాయపడుతుందని తెలియచేసారు. రెండవ ఐసిఏఎన్ఏ (ICANA) 2024 నిర్వహించినందుకు స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ సైన్సెస్ విభాగాన్ని అభినందించారు.
ప్రొఫెసర్ ఎస్ . శ్రీనివాస్ (డీన్-స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ సైన్సెస్) మాట్లాడుతూ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ సైన్సెస్ యొక్క ముఖ్య లక్ష్యాలను వివరించారు. ప్రపంచ నలుమూలల నుండి ఈ సదస్సుకు హాజరయిన ఔత్సాహికులకు, వక్తలకు కృతజ్ఞతలు తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో వీఆర్‌కే మూర్తి (ఎమిరిటస్ ప్రొఫెసర్), సంధ్యా సదానందన్ (అసిస్టెంట్ ప్రొఫెసర్, స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ సైన్సెస్), ప్రొఫెసర్ రజనీకాంత్ (అసోసియేట్ డీన్, స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ సైన్సెస్), విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు