విధి సంకల్పముచే నొకానొకడు తా విశ్వంబు పాలించుచో బధిరంబెక్కువ , చూపు తక్కువ, సదా భాషల్ దురూక్తుల్, మనో వ్యధతో మత్తత తోడ దుర్వ్యసన దుర్వ్యాపారతం చెందున, య్యధి కారాంతమునందు చూడ వలె నయ్యంగారి సౌభాగ్యముల్..!
నీచుడికి అధికారం వస్తే, వాడికి మంచి మాటలేవీ వినబడవు. ఆ విషయంలో బధిరుడవుతాడు, చూపు మందగిస్తుంది, అంటే మంచిని గ్రహించడు. ఎప్పుడూ చెడ్డ మాటలే మాట్లాడుతూ, చెడ్డ పనులే చేస్తూ ఉంటాడు… ఐతే, ఆ అధికారం పోయాక చూడాలయ్యా, ఆ అయ్య గారి వాలకం ! అని కవి దెప్పి పొడుస్తన్నాడు.
లంచ గొండులూ, కఠినాత్ములూ, పరుషంగా మాట్లాడే వారూ, పెద్ద హోదాలో ఉన్నంత కాలం విర్ర వీగడం, పదవీ విరమణ చేసాక నాగు పాము కాస్త మంటి బొక్కడం లాగా మారిపోవడం మనకి తెలిసిందే కదా..!
మహా కవి కాళి దాసు శాకున్తలంలో అధికారం ఎలాంటిదో వివరిస్తూ చెప్పిన గొప్ప శ్లోకం…
శ్రీలక్ష్మి కూ చి భట్ల