జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి-మంత్రి కొలుసు పార్థసారథి
• అబద్ధాలు ప్రచారం చేస్తున్న గోబెల్స్ పత్రికలపై చర్యలు తీసుకుంటాం
• జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి
• అగష్టు 1 నే ప్రతి ఇంటికి పింఛన్ అందిస్తాం
• ఆరోగ్య శ్రీ పై తప్పుడు రాతలు మానుకోవాలి
• గత ప్రభుత్వ చేతగాని తనంతోనే అప్పుల ఊబిలో రాష్ట్రం
• బిల్లులు కట్టకపోవడంతో నాడు చాలా ఆసుపత్రులు ఆరోగ్య శ్రీని నిలిపేశాయి
• పేదలకు వైద్యం అందకుండా చేసిన చేతగాని పాలన జగన్ ది
• మాపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
• టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీలు ఈ రాష్ట్రాభివృద్ధికి, ప్రజా ఆరోగ్యానికి కట్టుబడి ఉన్నారు.
జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని… వారు ప్రజలకు చేసిన మేలు ఏంటో చెప్పాలని… అసెంబ్లీకి రాకుండా అబద్దపు పత్రిక, టీవీ పెట్టుకుని గోబెల్స్ ప్రచారం చేయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కొలుసు పార్థసారథి మాట్లాడుతూ..
ఎన్నికల హామీని అమలు చేస్తూ… ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పింఛన్ ఇంటివద్దకే అందించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిది. క్రమం తప్పకుండా ఆగష్టు 1నే పింఛన్ అందించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గత ప్రభుత్వం కుంటి సాకులతో పింఛన్ దారులను ఇబ్బంది పెట్టింది. నేడు సచివాలయ సిబ్బందితోనే ఇంటింటికి పింఛన్ అందిస్తున్నాం. చంద్రబాబు నాయకత్వంతోనే ఏదైనా సాధ్యం అవుతుంది. ఒకే రోజు అన్ని పింఛన్లు అందించేందుకు కృషి చేస్తున్నాం. గత నెలలో జరిగిన చిన్న చిన్న తప్పులు కూడా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.
గత ప్రభుత్వం చేతగాని తనం వలన రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయింది.ఇటువంటి పరిస్థితిలో కూడా ఇచ్చిన హమీని నిలబెట్టుకుంటూ.. పింఛన్ దారులందరికి రూ. 2 వేల 737 కోట్లను ఒకే రోజు పంపిణీ చేయబోతున్నాం. పోయిన సారి సర్వర్ సమస్యలు వచ్చినా అధికారులు, సచివాలయ సిబ్బంది కమిట్ మెంట్ తో పింఛన్లను పంపిణీ చేశారు. ప్రజల ఉపాధిపట్ల విజన్ లేని వ్యక్తి వలన రాష్ట్రం అధోగతి పాలైంది. నేడు అటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు మీద నమ్మకంతో ఇతర రాష్ట్రాల వారు పెట్టుబడలు పెట్టడానికి చూస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా… తప్పించుకుంటున్న జగన్ ప్రభుత్వంపై అబద్దపు బురదజల్లుతున్నారు. జగన్ కు దమ్ముంటే రాష్ట్రానికి ఏమి మేలు చేశారో చెప్పాలి… మేము విడుదల చేస్తున్న శ్వేత పత్రాలు తప్పు అని అసెంబ్లీకి వచ్చి నిరూపించాలి.
వ్యక్తిగత గొడవలు, గంజాయికి అలవాటు పడిన మారణకాండపై ఢిల్లీకి వెళ్లి వైసీపీ ధర్నాచేయడం సిగ్గుచేటు. వైసీపీ నేతలు చేప్పెవి వాస్తవాలు అయితే అసెంబ్లీలో చర్చించాలి.. దాన్ని వైసీపీ పాంప్లెంట్ పత్రికలో ప్రచురించుకోవాలి. ముఖ్యమంత్రి సవాల్ విసిరితే సవాల్ ను స్వీకరించలేని దౌర్భాగ్యదుస్తితిలో వైసీపీ నేతలు ఉన్నారు. పత్రిక, టీవీ ఉందని అబద్ధాలు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. ఆరోగ్య శ్రీలో కూడా రూ. 1500 కోట్లు ప్రభుత్వం ఎగ్గొట్టిందని మాట్లాడుతున్నారు. వైసీపీ దుర్మార్గాలు, దుష్ఫలితాల ప్రభావమే … రాష్ట్రంలో నేడు ఈ పరిస్థితికి కారణం. వైసీపీ పాలనలో ఆసుపత్రులకు చెల్లించాల్సిన పేమెంట్ చెల్లించకపోవడంతో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపేస్తూ ఎన్నో సార్లు ఆయా ఆసుపత్రులు ధర్నాకు దిగాయి. వైసీపీ నేతలు చేసిన ఆర్థిక అవకతకవల మూలంగా.. రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేయడం వలన ఆకరికి బోజనాలు సప్లై చేసే వారికి కూడా బిల్లులు ఇవ్వలేని దుస్థితి ఉంది.
రాష్ట్రాన్ని రూ. 11 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టి ఆరోగ్య శ్రీకి డబ్బులు చెల్లించలేదని చెప్పడం ఎంతవరకు సమంజసం.టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీలు ఈ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులను మెరుగు పరిచేందుకు కట్టుబడి ఉన్నారు. గతంలో బీపీఎల్ దిగువన ఉన్న కోటి 20 లక్షమందికి ఈ పథకానికి వర్తింప చేసి 12 లక్షల మందికి రూ .50 330 కోట్లు చెల్లించింది. 6 లక్షల మందికి మూత్రపిండాల మార్పిడి… 3 లక్షల మందికి ఉచిత వైద్యసేవలు అందిచాం. 70 క్లైమ్స్ ను వెంటన చెల్లించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిది. జగన్ పాలనలో ఎన్నోసార్లు ఆరోగ్య శ్రీ సేవలను కొనసాగించలేమని ఆసుపత్రులు చెప్పాయి. దీంతో ఎంతో మంది పేదలకు ఆరోగ్యం అందలేదు. పత్రిక ఉందని గోబెల్స్ ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. అబద్దాలు ప్రచారం చేయడం మాని అసెంబ్లీకి వచ్చి వైసీపీ నేతలు చేసిన మేలు ఏదైనా ఉంటే చెప్పుకోవాలి. ప్రజలకు ఎంతో నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. వైసీపీ నేతలు చేసిన కబ్జాలు, విధ్వంసం, అభివృద్ధిని విస్మరించినదాన్ని డైవర్ట్ చేయడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.రాష్ట్ర ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి అబద్దాలు ప్రచారం చేస్తే మూల్యం చెల్లించుకుంటారు.