అమరావతి:
వీ.ఐ.టి-ఏపీ బిజినెస్ స్కూల్ ఆధ్వర్యంలో ఐసీఐఎస్‌డీ’26: డిజిటల్ యుగంలో నూతన ఆవిష్కరణ ,స్థిరమైన వ్యాపార పద్ధతులపై అంతర్జాతీయ సదస్సు
అమరావతి, ఫిబ్రవరి 27, 2026:
విఐటి-ఏపి విశ్వవిద్యాలయం, విఐటి-ఏపి స్కూల్ అఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో, యూనివర్సిటీ అఫ్ న్యూ క్యాజిల్, హేరియట్ వాట్ యూనివర్సిటీ ,బర్మింగ్హామ్ సిటీ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో “డిజిటల్ యుగంలో నూతన ఆవిష్కరణ ,స్థిరమైన వ్యాపార పద్ధతులు (ICISD’26)” అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ఫిబ్రవరి 26 మరియు 27, 2026 తేదీల్లో నిర్వహించబడింది.
విఐటి-ఏపి స్కూల్ అఫ్ బిజినెస్ డీన్ ఇన్‌చార్జ్ డా|| అరుణ్‌కుమార్ శివకుమార్ స్వాగత ప్రసంగంలో నేటి డిజిటల్ ప్రపంచంలో నవీనత మరియు స్థిరత్వం కలయిక యొక్క ప్రాముఖ్యతను వివరించి, సదస్సు లక్ష్యాలను వెల్లడించారు. సదస్సు కన్వీనర్ డా. మధుస్మితా మొహంతి కార్యక్రమానికి సమగ్ర అవలోకనం ఇచ్చి, సహ-కన్వీనర్లను పరిచయం చేశారు.
సదస్సును ప్రారంభించిన విఐటి-ఏపి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ (I/c) డా|| పి. అరుల్మొళివర్మన్ మాట్లాడుతూ ఆర్థిక వృద్ధికి నూతన ఆవిష్కరణ మరియు స్థిరత్వం అనే రెండు స్తంభాల ప్రాధాన్యతను వివరించారు. డిజిటల్ మార్పు మరియు స్థిరత్వం కలయిక మానవాళికి ఒక కీలక మలుపు అని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలు ఆలోచనలు మరియు నాయకత్వానికి ఆవాసాలుగా ఉండాలని, నైతికత మరియు బాధ్యతలపై దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు లక్ష్యంతో నవీనత సాధించి, అన్ని భాగస్వాములకు విలువ సృష్టించాలని పిలుపునిచ్చారు.
ముఖ్య అతిథి ఆర్. వెంకటేశ్వరన్, జనరల్ మేనేజర్, సెక్యూరిటీస్ అండ్ ఎక్సహంగే బోర్డు అఫ్ ఇండియా మాట్లాడుతూ వాతావరణ మార్పు ఒక ప్రపంచ సమస్యగా ఉందని, దానికి నూతన ఆవిష్కరణలు, స్థిరత్వం మరియు డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని తెలిపారు. “వికసిత భారత్ 2047” లక్ష్యాన్ని మరియు భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన నేషనల్ గైడ్‌లైన్స్ ఆన్ రెస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్ (NGBRC)ను ప్రస్తావించారు. అలాగే SEBI ప్రవేశపెట్టిన ESG పనితీరుపై బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబిలిటీ రిపోర్టింగ్ (BRSR) విధానాన్ని వివరించారు.
గౌరవ అతిథి డా. ఫ్రాన్సెస్కో పాలోచ్చి, న్యూకాసిల్ బిజినెస్ స్కూల్, ఆస్ట్రేలియా ప్రొఫెసర్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సవాళ్లను వివరించి, వాటిని ఎదుర్కొనేందుకు AI ఆధారిత స్థిరత్వ అనువర్తనాల వినియోగాన్ని వివరించారు.
మరో గౌరవ అతిథి ప్రొఫెసర్ ఎడ్వర్డ్ స్వీని, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డీన్, ఎడిన్‌బర్గ్ బిజినెస్ స్కూల్, హెరియట్-వాట్ యూనివర్శిటీ, స్కాట్లాండ్, విఘాతక సాంకేతిక ఆవిష్కరణలను స్వీకరించడం ద్వారా వ్యాపార స్థిరత్వాన్ని సాధించే మార్గాలను వివరించారు. పర్యావరణ, సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధి అంశాలను సమగ్రంగా పరిగణించాలని సూచించారు.
అరుణ్ సుకుమార్, బర్మింగ్హామ్ సిటీ యూనివర్సిటీ ప్రొఫెసర్, వర్చువల్‌గా పాల్గొని, స్థిరత్వం వంటి సమయోచిత అంశంపై సదస్సును నిర్వహించినందుకు బిజినెస్ స్కూల్‌ను అభినందించారు.
డా. నవనీతకృష్ణన్ కె ధన్యవాదాలు తెలిపారు. డా. మొహమ్మద్ అబ్దుల్ ముకీత్ మాజ్ ప్రారంభ సమావేశానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపన్యాసాలు, ప్యానెల్ చర్చలు, సాంకేతిక సెషన్లు మరియు పరస్పర చర్చలు నిర్వహించబడ్డాయి. వ్యాపార వృద్ధి మరియు పర్యావరణ స్థిరత్వాన్ని పురోగమింపజేసే అత్యాధునిక వ్యూహాలు, సాంకేతికతలు మరియు ఉత్తమ పద్ధతులను అన్వేషించడమే సదస్సు ముఖ్య ఉద్దేశ్యం. విభిన్న వర్గాల మధ్య సంభాషణ మరియు సహకారాన్ని ప్రోత్సహించడం ద్వారా, స్థిరమైన మరియు సమృద్ధి భవిష్యత్తు కోసం కార్యాచరణాత్మక ఆలోచనలు మరియు భాగస్వామ్యాలను పెంపొందించడం ఈ సదస్సు లక్ష్యం.
ఈ రెండు రోజుల సదస్సులో మొత్తం 149 పరిశోధనా పత్రాలు 9 సాంకేతిక సెషన్లలో ప్రదర్శించారు.

















































