ఘనంగా హరీష్ సాల్వే మూడో పెళ్లి
మాజీ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే(68) మూడో పెళ్లి లండన్ లో ఘనంగా జరిగింది. హరీష్ సాల్వే తన స్నేహితురాలు త్రినాను మూడో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి నీతా అంబానీ, లలిత్ మోడీ, ఉజ్వల్ రౌత్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వివాహానికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2020లో బ్రిటీష్ ఆర్టిస్ట్ కరోలిన్ బ్రోస్సార్డ్ అంతకుముందు మీనక్షిని పెళ్లి చేసుకున్నారు.
సాల్వే 1999 నవంబరు నుంచి 2002 వరకు భారతదేశం సొలిసిటర్ జనరల్ గా పనిచేశారు. ఈ జనవరిలో వేల్స్, ఇంగ్లాండ్ కోర్టులకు క్వీన్స్ కౌన్సిల్ గా నియమితులయ్యారు. 2015లో సాల్వేకు పద్మభూషణ్ అవార్డు లభించింది. అదే సంవత్సరం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసునుంచి విముక్తి పొందారు. అంతకు ముందు అతనికి 5 ఏళ్ల శిక్షపడిన విషయం తెలిసిందే..