హైకోర్టు న్యాయమూర్తుల గ్రాట్యూటీ పరిమితి పెంపు
రూ. 20 లక్షల నుండి 25 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ
అమరావతి
================
భారత ప్రభుత్వపు కేంద్ర న్యాయశాఖ లేఖను అనుసరించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులకు గ్రాట్యూటీ పరిమితిని పెంచుతూ రాష్ట్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సోమవారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. 1.1.2024 నుండి గ్రాట్యూటీ మొత్తాన్ని రూ.20 లక్షలు నుండి రూ.25 లక్షలుకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.





































