అమరావతి
2025-26 ధాన్యం కొనుగోళ్లపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష
23 జిల్లాల్లో ఇప్పటి వరకూ 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు వివరించిన అధికారులు
గతేడాదితో పోలిస్తే 32 శాతం మేర పెరిగిన ధాన్యం కొనుగోళ్లు
మొత్తం 2606 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రోక్యూర్మెంట్ ప్రక్రియ జరుగుతున్నట్టు వెల్లడి
కొనుగోలు కేంద్రాల వద్ద 7.89 కోట్ల గోనె సంచులను రైతులకు అందుబాటులో ఉంచిన ప్రభుత్వం
ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే రూ.4085 కోట్ల మేర చెల్లింపులు చేసినట్టు తెలిపిన పౌరసరఫరాల శాఖ
ఈ ఏడాది మొత్తంగా 50.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం
సమీక్షకు హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యవసాయ, పౌరసరఫరాలు, ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు













































