అమరావతి..
రాజధాని రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు రైతులను సన్నద్ధం చేస్తున్న ప్రభుత్వం
అమరావతి మండలం ఎండ్రాయి గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రైతులతో సమావేశం నిర్వహించిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రవీణ్
మంత్రి నారాయణ కు ఘన స్వాగతం పలికిన 4 గ్రామాల రైతులు
ఎండ్రాయి గ్రామంలో రైతు ధర్మారావు తో కలిసి ఆయన నివాసంలో బ్రేక్ ఫాస్ట్ చేసిన మంత్రి నారాయణ,పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
అమరావతి మండలం లో ల్యాండ్ పూలింగ్ లో ఉన్న 4 రెవెన్యూ గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించిన మంత్రి, ఎమ్మెల్యే
ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ కు ముందే మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రవీణ్ సమక్షంలో ఆర్డీవో కు 4 ఎకరాల భూమికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ను అందించిన రైతు నంబూరి బలరాం
ల్యాండ్ పూలింగ్ లో ఏ సమస్య ఉన్నా తన వద్దకు రావాలని భరోసా ఇచ్చిన మంత్రి
ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం కోసం రైతులు ల్యాండ్ పూలింగ్ కు సహకరించాలని కోరిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
……నారాయణ,మంత్రి కామెంట్స్….
రాజధానిలో రైతుల భూముల ధరలు పెరగాలంటే స్మార్ట్ ఇండస్ట్రీలు,ఎయిర్ పోర్ట్ రావాలి
దీని ద్వారా ఉద్యోగాలు వచ్చి ఎకనమిక్ గ్రోత్ పెరుగుతుంది
స్పోర్ట్స్ సిటీ నిర్మాణ పనులు ఏడాదిలోగా ప్రారంభించాలని సీఎం చెప్పారు
రైతులకు ఇచ్చే ప్లాట్ లలో ముందుగా రోడ్లు వేస్తాం
ఒలింపిక్ క్రీడలు నిర్వహించే స్థాయిలో 2500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తాం
ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారని ఎమ్మెల్యే లు చెప్పారు
అందుకే గతంలో మాదిరిగా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకుంటున్నాం
ఇప్పటికే ఆయా గ్రామాల్లో గ్రామ సభల ద్వారా ప్రజాభిప్రాయలు తీసుకున్నారు
రైతులకు క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపు ఇచ్చే ప్రతిపాదన పై కేంద్రం సీరియస్ గా పరిశీలిస్తుంది
గత ప్రభుత్వ నిర్వాకంతో పాటు వర్షాల వల్ల రాజధాని నిర్మాణ పనులు కొంచెం ఆలస్యం అయ్యాయి
ల్యాండ్ పూలింగ్ కు సహకరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు











































