విద్యాహక్కు చట్టం ప్రకారం అర్హులైన నిరుపేద బాలలకు 25125 పాఠశాలల్లో ఉచిత సీట్లు .
…….ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు
@ @ @
విద్యాహక్కు చట్టం ప్రకారం, సెక్షన్ 12 (సి ) ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్రములోని ప్రైవేట్ మరియు అన్ఎయిడెడ్ పాఠశాలలో అర్హులైన తక్కువ ఆదాయము గల బడుగ వర్గాల నిరుపేద కుటుంబాల బాలలు, సామాజిక వర్గాల , అనాథ బాలలకు వారి బంగారు భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని 26 జిల్లాలకు సంబంధించి ” 25125″ మంది బాలలకి రాష్ట్ర విద్యాశాఖ వారు ఉచితంగా ప్రవేశాలును కల్పించడం జరిగింది. వారికి పాఠశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా ఏటువంటి ఫీజులు వసూలు చేయకుండా ప్రవేశాలు కల్పించాలని సూచించారు.రాష్ట్రం లో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరంలో అత్యధిక సీట్లు గణనీయంగా పెరగడం చాలా అభినందించవలసిన విషయం అని ఆంధ్ర ప్రదేశ్ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు అన్నారు.
బాలల హక్కుల కమిషన్ ఈ విద్యాహక్కు చట్టం పనితీరుపై విద్యా శాఖ సమన్వయంతో పర్యవేక్షణ చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ సీట్ల కేటాయింపులో ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించి ప్రవేశాలు కల్పించాలని, ఉల్లంఘనకు పాల్పడిన విద్యాసంస్థలపై కమిషన్ ద్వారా కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేశారు.
ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు మంగళగిరి లోని కమిషన్ కార్యాలయానికి
ఈ ఇమెయిల్ apscpcr2018@gmail కు ఫిర్యాదు చేయవొచ్చని అప్పారావు సూచించారు
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT