అమరావతి
పయ్యావుల కేశవ్, ఆర్థిక మంత్రి.
30 ఏళ్ల క్రితం సీఎంగా చంద్రబాబు నాయుడు తొలి సారి ప్రమాణ స్వీకారం చేస్తున్న ఫొటో ఇది.
దీన్ని కేవలం ఫొటోగానే చూడకూడదు.. ఇదొక చరిత్ర.
తెలుగు ప్రజల తలరాతలను మార్చిన అద్భుత ఘట్టం.
తెలుగు జాతి ఖ్యాతి దశదిశలా ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందడానికి కారణ భూతమైన మహత్తర సన్నివేశం.
నాయకుడంటే అధికారాన్ని అనుభవించే వాడు కాదు… ముందుండి నడిపించే వాడని నిరూపించిన సందర్భం.
ఈ 30 ఏళ్లల్లో చంద్రబాబు గారు ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. నాలుగు సార్లు సీఎం అయ్యారు… 3 సార్లు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.
30 ఏళ్ల ప్రస్థానంలో ఆయన రాజకీయాల పైనే కాదు… తెలుగు రాష్ట్రాల ప్రజలపై చెరగని ముద్ర వేశారు.
ఐటీ విప్లవం తెచ్చినా, విద్యుత్ సంస్కరణలు చేసినా ప్రజల కోసమే.
డ్రిప్ ఇరిగేషన్ తెచ్చినా, హంద్రీ-నీవా వంటి ప్రాజెక్టులు చేపట్టినా… ప్రజల కోసమే.
టెక్నాలజీ గురించి మాట్లాడేది ప్రజల కోసమే… టెక్నాలజీని ప్రభుత్వ శాఖలతో అనుసంధానం చేసేది ప్రజల కోసమే.
30 ఏళ్ల క్రితం చంద్రబాబు గారు తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు కొత్త లుక్ తెచ్చారు.
రాజధాని ప్రాంతాన్ని కేవలం నగరంగా చూడకుండా… రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గ్రోత్ ఇంజన్ లా మార్చారు.
ఇప్పుడు అదే తరహాలో విభజిత రాష్ట్రానికి సారథ్యం వహిస్తున్నారు.
పాలనా అంటే పెత్తనం కాదు… పోషణ అని చెప్పిన దార్శనికుడు చంద్రబాబు గారు.
కుటుంబ పోషణ కోసం ఇంటి పెద్ద ఎలా కష్టపడతాడో… రాష్ట్రం కోసం చంద్రబాబు గారు అదే విధంగా కష్టపడ్డారు… పడుతున్నారు.
30 ఏళ్లుగా ఆయన అడుగులో అడుగు వేస్తూ ఆయన మార్గాన్ని ఆచరిస్తున్నా.
చంద్రబాబు గారు ప్రతి రోజూ కొత్తగా కన్పిస్తారు. కొత్త ఆలోచనలతో వస్తారు… కొత్త ఆవిష్కరణలతో నిర్ణయాలు తీసకుంటారు.
70 ఏళ్లు దాటినా… చంద్రబాబు గారు చేసే ఆలోచనలు నిత్య నూతనం… సదా ఆచరణియం.