ఇంజనీరింగ్ కళాశాల కనిష్ట ఫీస్ 43,000/_ హై కోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు
2020-23 ఫీజులు నియంత్రణ చట్టబద్ధంగా జరగలేదని గౌరవ హై కోర్ట్ ను ఆశ్రయించిన ఇంజనీరింగ్ కళాశాలల సంఘం.
2019 లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలాల ఫీజులు గణనీయంగా తగ్గిస్తూ ఉన్నత విద్యా శాఖ నిర్ణయం తీసుకుందని అదే ఫీజులను 2023 వరకు కొనసాగించడం వల్ల ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల మనుగడ కష్ట తరగంగా మారింది అని పిటిషనర్ తరపున న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ కోర్ట్ దృష్టికి తీసుకొని వచ్చారు.
రెగ్యులేటరీ కమిషన్ ఫీజులు నియంత్రణ పూర్తిగా అసాస్త్రీయంగా చేసిందని అందుకనే కళాశాలలు అడిగిన వర్క్ షీట్ట్స్ లు సమర్పిచలేకపోతునారని శ్రీవిజయ్ కోర్టుకు తెలియజేశారు.
ఉన్నత విద్యాశాఖ తరపున వాదనలు వినిపించిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తూ 2023-26 సంవత్సరాలకు రెగ్యులేటరీ కమిషన్ ప్రతిపాదించిన ఫీజులను ఉన్నత విద్యాశాఖ ఆమోదించలేదని, గతంలో హై కోర్ట్ మద్యంత ఉత్తర్వులు ఇచ్చిన కారణంగా కొన్ని ఖర్చులను కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదని కనుక 2023/24 విద్య సంవత్సరానికి పాత ఫీజులే కొనసాగిస్తం అని, దానికి అనుగుణంగా గౌరవ హై కోర్ట్ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
సదరు ప్రతిపాదనకు అభ్యంతరం తెలుపుతూ ఇప్పటికే రాష్ట్రంలో చాలా ఇంజనీరింగ్ కళాశాలలు ముతపడ్డాయని విద్యాశాఖ ప్రతిపాదన అమలు చేస్తే మరిని కళాశాలలు మూత పడడం ఖాయమని శ్రీవిజయ్ తెలియజేశారు.
కౌన్సిలింగ్ సమయం దగ్గర పడిన కారణంగా ఫీజులు 10 శాతం పెంచుతామని ఉన్నత విద్యాశాఖ కోర్టుకు ప్రతిపాదన చేసింది.
దీనికి రొటేషన్ తరఫున న్యాయవాది అభ్యంతరం తెలియజేస్తూ ఇతర రాష్ట్రాల ఫీజుల కంటే మన రాష్ట్రం ఫీజు చాలా తక్కువ అని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక కంటే తక్కువగా ఉన్నాయని 45000 కనిష్ట ఫీజు ఉంటేనే కాలేజీలు నిలబడతాయని కోర్టుకు తెలియజేశారు.
ఇరువాదనలు విన్న గౌరవ హైకోర్టు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో కనిష్ట ఫీజు 43000గా దానిపై ఫీజులు ఉన్న కళాశాలలకు 10 శాతం పెంచమని ఉన్నత విద్యాశాఖకు మరియు రెగ్యులేటరీ కమిషన్ను ఆదేశిస్తూ మద్యంత ఉత్తర్వులు జారీ చేసింది.
మతుకుమిల్లి శ్రీవిజయ్, స్టేట్ లీగల్ అడ్వైజర్, హైకోర్టు న్యాయవాది