దిశ SOS ఎఫెక్ట్…
గుంటూరు జిల్లా:
గుంటూరు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేసే వైద్యురాలిని భర్త వేధింపులకు గురిచేసాడు. భర్త పెట్టే బాధలను భరించలేక మహిళా డాక్టర్ దిశ SOS కాల్ చేసి ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన గుంటూరు లోని సీతారామ నగర్ లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
డా.ఉమా దేవి గుంటూరు లోని విశ్వా హాస్పిటల్ లో వైద్యురాలిగా పనిచేస్తోంది. తన భర్త ఉపేంద్ర కూడా అదే హాస్పిటలో డాక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి మధ్య గత కొంత కాలంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున డా.ఉమా దేవిని భర్త ఉపేంద్ర కొట్టడం జరిగింది. భయంతో బాధితురాలు దిశ SOS కు కాల్ చేసి సహాయం కోరింది.
బాధిత మహిళ దిశ SOS కు కాల్ చేసిన పది నిముషాల వ్యవధిలో పోలీసులు లోకేషన్ కు చేరుకున్నారు. భార్య ఉమాదేవి పై చేయి చేసుకొని గొడవ పడుతున్న భర్త ఉపేంద్రను పోలీసులు అదుపు చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో పదేపదే తనతో భర్త గొడవ పడుతున్నట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. డా.ఉమాదేవి ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా భర్త ఉపేంద్ర పై చర్యలు తీసుకుంటామని ఓల్డ్ గుంటూరు పోలీసులు పేర్కొన్నారు.